ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడో జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా  వైరస్ ప్రభావం కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతివిమర్శలు జరుగుతున్నాయి  అనే విషయం తెలిసిందే.  ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య స్థానిక సంస్థలను నిర్వహించి ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పెట్టడం  ఇష్టం లేదని అందుకే ఇప్పట్లో ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే యోచన లేదు అంటూ అటు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ స్పష్టం చేస్తోంది.



 ఇదే సమయంలో అటు టీడీపీ నేతలు కూడా జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం స్థానిక సంస్థల నిర్వహించేందుకు సిద్ధమైనప్పటికి కూడా జగన్ సర్కారు ఎన్నికల సంఘానికి సహకరించక పోవడం దారుణం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే... ఓడిపోతామనే భయంతోనే ప్రస్తుతం జగన్ సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ముందుకు రావడంలేదు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు ప్రస్తుతం ప్రతిపక్ష టిడిపి పార్టీ నేతలు.



 టిడిపి పార్టీ నేతలు చేసిన విమర్శలపై ఇటీవలే సోషల్ మీడియా వేదికగా స్పందించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి చంద్రబాబు పై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు.
 జిహెచ్ఎంసి ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వస్తుంది అంటూ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిడిపి ఆరు స్థానాల్లో పోటీ చేస్తే దక్కిన స్థానాలు సున్నా అంటూ ఎద్దేవా చేశారు. కిందటిసారి చంద్రబాబు మద్దతు దారులైన సినీ నటులు ప్రచారం చేస్తే ఒక్కటంటే ఒక్క సీటు గెలిచిందని  దీన్ని బట్టి బాబు పార్టీ రోజురోజుకు ఎగబాకుతోందా లేక  దిగజారుతున్నదా  అర్థం చేసుకోవచ్చు అంటూ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే రిజల్ట్ రిపీట్ అవుతుంది అంటూ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: