కరోనాకు ఎన్ని రూపాలు ఉన్నాయి అంటే చెప్పడం కష్టమే. ఆ పరమాత్ముడికి ఎన్ని రూపాలు ఉన్నాయో దానికి మించి కరోనా తన వివిధ‌ రూపాలను చూపుతోంది. ఇప్పటిదాకా కరోనా చూపించిన రూపాలు చాలానే ఉన్నాయని వైద్య  రంగ నిపుణులు అంటున్నారు. అయితే వాటికి మించి ప్రమాదకరమైన రూపాలతోనే కరోనా ముందుకు దూసుకురావడంతోనే విశ్వ మానవాళి బెంబేలెత్తుతోంది.

ఇదిలా ఉంటే ఇప్పటిదాకా యూకే కొత్త స్ట్రెయిన్ అంటూ ప్రపంచం కంగారు పడింది, బెంబేలెత్తింది. కానీ ఇపుడు దాన్ని మించి అన్నట్లుగా బ్రెజిల్ లో కొత్త స్ట్రెయిన్ దూసుకు వస్తోంది. దీంతో కరోనా కొత్త రూపాన్ని చూసి లోకమంతా జడుసుకుంటోంది. దానికి కారణం ఇది అతి పెద్ద ముప్పు తెచ్చి పెట్టేది అంటున్నారుట.

ఇక గత నెలలో బ్రెజిల్ దేశంలో కనిపించిన ఈ కొత్త రకం కేసులు ఏవీ ఇప్పటిదాకా భారత్ లో నమోదు కాలేదని అంటున్నారు. ఇక ఇప్పటికే దాదాపుగా పది వరకూ మ్యుటేషన్స్ కి గురి అయిన ఈ స్ట్రెయిన్ జపాన్ లో కూడా తాజాగా వెలుగు చూసిందని అంటున్నారు. దీంతో ఇది ఇతర దేశాలకు కూడా పాకుతుంది అని అంటున్నారు.

ఈ పరిణామతో ఇపుడు ప్రపంచం అంతా మరోమారు హడలిపోతోంది. ఒక వైపు కరోనా వ్యాక్సిన్ ని దాదాపుగా యాభై దేశాల్లో పంపిణీ చేస్తున్నారు. ఎనిమిది వందల కోట్ల ప్రపంచ జనాభాకు హఠాత్తుగా ఈ వ్యాక్సిన్ ఇపుడు అందడం కష్టమే. పైగా కొత్త స్ట్రెయిన్ కి ధీటుగా ఎదుర్కొనే వ్యాక్సిన్ అన్నది ఉందా అని కూడా చూడాలని అంటున్నారు.

ఇంకో వైపు నార్వేలో గత నెలలో ఫైజార్ టీకాను చాలా మంది వేసుకున్నారు. వారిలో 23 మంది తాజాగా చనిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. దాంతో కరోనా టీకాల మీద ఒక వైపు సందేహం వస్తూంటే మరో వైపు కరోనా మరింతగా విస్తరిస్తూ విశ్వ రూపాన్ని చూపిస్తోంది. దీంతో ప్రపంచ దేశాలు ఎలా అధిగమించాలా అన్నది అంతుబట్టక తల్లడిల్లుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: