అమెరికా వంటి అగ్ర దేశానికి నాలుగేళ్ల పాటు అధ్యక్షుడిగా సేవలు అందించిన డొనాల్డ్ ట్రంప్ చాలా వివాదస్పద ప్రెసిడెంట్ గా పేరు తెచ్చుకున్నారు. చరిత్రలో తనకో పేజీని ఆయన అలాగే  రాసుకున్నారు. ఇక ట్రంప్ మాజీ అయిపోయారు. నాలుగేళ్ల క్రితం అ పదవి అనూహ్యంగా  ఎలా వచ్చిందో ఇపుడు అలాగే చేజారింది.

మరి రిటైర్ అయిన ట్రంప్ ఎక్కడ ఉంటారు. ఎలా ఉంటారు. ఆయన భవిష్యత్తు వ్యూహమేంటి. ఇవన్నీ సగటు అమెరికన్ పౌరునితో పాటుగా అంతర్జాతీయ సమాజంలోనూ  చర్చకు అవకాశం ఇస్తున్నాయి. ట్రంప్ ఎంతటి వారు అంటే జో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా హాజరు కాను అని ఒట్టేసుకుని మరీ ముందే తన పెట్టే బేడా సర్దుకున్నారు. ఇక ఆయన ఇప్పటిదాకా ఉన్నది వాషింగ్టన్. ఆయన‌ ఇంతకు ముందు ఉండేది అయితే న్యూయార్క్ మహా నగరం. కానీ పదవీ విరమణ చేసిన ట్రంప్ ఇపుడు ఫ్లోరిడాకు తన మకాం మార్చబోతున్నారుట‌.

ఆయన మూడున్నర దశాబ్దాల క్రితం ఫ్లోరిడాలో ఒక అద్భుతమైన రాజప్రసాదం కొనుగోలు చేశారు. దాని పేరు  మారాలాగో ఎస్టేట్‌. అందులో ఉన్న గదుల సంఖ్యే చూస్తే మతి పోవాల్సిందే. 128 విశాలమైన గదులతో 20 ఎకరాల్లో దీన్ని ఫ్లోరిడాకు సమీపంలోని పామ్  బీచ్ దగ్గర ఇప్పటికి వందేళ్ళ క్రితం అంటే 1927లో నిర్మించారు. దాన్ని 1985లో ట్రంప్ కొనుగోలు చేశారు. ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్నపుడు అయితే శీతాకాల‌ విడిదికి ఇక్కడికి వచ్చేవారు అంటారు. దాంతో ప్రెసిడెంట్ వింటర్ వైట్ హౌస్ అని అంతా పిలిచేవారు. ఇదిలా ఉంటే ఈ మారాలాగో ఎస్టేట్‌ నుంచి చూస్తే అట్లాంటిక్ సముద్రం అందాలు ఎగిసిపడే కెరటాలను చూడవచ్చు. మొత్తానికి అందానికి ప్రశాంతతకు మారు పేరు గా ఉన్న ఈ రాజ ప్రసాదమే మాజీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇకపైన నివాసమని  అంటున్నారు. సో ట్రంప్ ఇక్కడ నుంచే తన ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మొదలుపెడతారు అన్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: