తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటే ఏ విధమైన పరిణామాలు ఉంటాయి ఏంటనే దానిపై అందరు కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్నారు. ఇక ఆయనకు పదవి  ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా చాలావరకు దూకుడుగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు బలంగానే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనను వాడుకునే విషయంలో ఘోరంగా విఫలమవుతున్నారు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది.

తనకు ప్రచార కమిటీ చైర్మన్గా బాధ్యతలు కావాలని ఆయన ఇటీవల ఒక చానెల్లో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఈ పదవి విషయంలో కాస్త సీరియస్గా వ్యవహరిస్తుంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను జీవన్ రెడ్డికి అప్పగించే అవకాశం ఉందని అన్నారు. అయితే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ పదవికి ఎంపిక అనేది వాయిదా పడింది. మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటనే దానిపై స్పష్టత లేకపోయినా రేవంత్ రెడ్డికి మాత్రం భారతీయ జనతా పార్టీ కూడా సహకరిస్తుంది.

ఆయనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గా ఎంపిక చేసే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. బండి సంజయ్ కేంద్రమంత్రిగా వెళ్లే అవకాశం ఉందని ఈ మేరకు ఇప్పటికే బీజేపీ అధిష్టానం చర్చలు జరిపిందని తెలంగాణ నుంచి బీసీ కేంద్రమంత్రిగా వెళ్తే మంచి లాభాలు ఉంటాయనే ఆలోచనలో ఉందని అంటున్నారు. అలాగే రెడ్డి సామాజికవర్గం నుంచి రేవంత్ రెడ్డి ని రంగంలోకి దించితే... బాగుంటుందని భావించినా... బండి సంజయ్ మాత్రం కేంద్ర మంత్రిగా వెళ్లడానికి ఒప్పుకోవడం లేదని అంటున్నారు. రేవంత్ రెడ్డిని కేంద్రమంత్రిగా పంపిస్తే బాగుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తాను ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తున్నాను కాబట్టి ఆ పదవిని తాను తీసుకుంటే అనవసరంగా  పార్టీ ఇబ్బంది పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారట.

మరింత సమాచారం తెలుసుకోండి: