బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కొన్ని కొన్ని విషయాల్లో తప్పులు ఎక్కువగా చేస్తున్నారు. ప్రధానంగా తిరుపతి ఉప ఎన్నికల విషయంలో ఆయనకు అస్సలు అవగాహన లేదు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ముందు నుంచి కూడా బీజేపీని ముందుకు నడిపించే విషయంలో ఆయన వెనకడుగు వేస్తున్నారు. రాజకీయంగా ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో ఎటువంటి తప్పులు చేసినా సరే ఆ ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని ఏ మాత్రం కూడా గ్రహించలేని సోము వీర్రాజు ఇప్పుడు భారతీయ జనతా పార్టీని ముందుకు నడిపించే విషయంలో వెనకడుగు వేస్తున్నారు.

బీజేపీ నేతలు ఇప్పుడు విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో పెద్దగా మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం లేదు. దీని కారణంగా పార్టీ ఎక్కువ ఇబ్బందులు పడుతోంది. ఇప్పటికే కార్యకర్తల్లో చాలా వరకు కూడా ఆందోళన ఉంది. ప్రైవేటీకరణ చేస్తే వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. దీంతో ఇప్పుడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రానికి వాస్తవ పరిస్థితులను నివేదించాలి. అయినా సరే ఆయన కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అసలు వాస్తవాలు ఏ మాత్రం కూడా చెప్పే ప్రయత్నం చేయడం లేదు అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

సోము వీర్రాజు అధ్యక్షుడు అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ కంటే కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా బాగుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టిన సరే ఇప్పుడు పార్టీ ప్రజల్లోకి వెళ్లి మేము న్యాయం చేస్తామని తప్పు చేశామని తెలుసుకున్నామని కూడా అంటోంది. కానీ బీజేపీ నేతలు మాత్రం వరుసగా తప్పులు చేస్తూనే ఉన్నారు. ఇదేవిధంగా బిజెపి రాజకీయం చేస్తే భవిష్యత్తులో పార్టీ కనీసం పోటీ చేసే అభ్యర్థుల కోసం కూడా ప్రతికూల పరిస్థితి ఎదుర్కొంటుంది అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: