తెలంగాణ రాజ‌కీయాల్లోకి ష‌ర్మిల రాక స్ప‌ష్ట‌మైపోయింది. తెలంగాణ రాజ‌కీయాల్లోకి అరంగేట్రాన్ని ఘ‌నంగా ప్రారంభించాల‌ని ఆమె నిర్ణ‌యించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఓ వైపు ముమ్మ‌రంగా జ‌రుగుతూనే ఉన్నాయి. మ‌రోవైపు రోజుకు ఒక జిల్లా నేత‌ల‌తో పాటు ఏదైనా వ‌ర్గం నేత‌ల‌తో స‌మావేశం అవుతున్నారు. ప‌రిమిత స‌మాచారాన్ని కూడా వారికి వివ‌రిస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ అడ్డును ఎలా తొల‌గించుకోవ‌చ్చో కూడా ఇటీవ‌ల ఆమె సుస్ప‌ష్టం చేశారు. అయితే ఇంత జ‌రుగుతున్నా టీఆర్ ఎస్ అధినేత ముఖ్య‌మంత్రి కేసీఆర్ నోరు మెద‌ప‌డం లేదు. తెలంగాణ రాజ‌కీయాల్లోకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ నేత‌లు ష‌ర్మిల‌తోనే ఆరంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని, ష‌ర్మిల రాజ‌కీయ ప్ర‌య‌త్నాల‌ను అణిచివేయ‌క‌పోతే మున్ముందు మ‌ళ్లీ టీడీపీ స‌హా ఇత‌ర పార్టీల‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్ల‌వుతుంద‌ని టీఆర్ ఎస్ ప్ర‌జాప్ర‌తినిధుల‌తో ముఖ్య నేత‌ల్లోనూ ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.


అయితే ఈ విష‌యంలో కేసీఆర్ మాత్రం వ్యూహాత్మ‌క మౌనం వ‌హిస్తున్నార‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు టీడీపీ నేత‌ల‌ను, కాంగ్రెస్ పార్టీ పొత్తుతో క‌ల‌సి నిల‌బెట్ట‌డం ద్వారా తెలంగాణ సెంటిమెంట్ ర‌గిలి అనుహ్యంగా భారీ సంఖ్య‌లో ఎమ్మెల్యే సీట్ల‌ను గెల్చుకుంది. ఇప్పుడు ష‌ర్మిల రాక‌తో తెలంగాణ సెంటిమెంట్ భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌కు ప‌నికి వ‌స్తుంద‌నే ఆలోచ‌న‌తో మౌనందాల్చుతున్నాడంటూ విశ్లేషిస్తున్నారు. అయితే ఇది ఎంత‌వ‌ర‌కు వాస్త‌వం అనేది మ‌రి కొద్దిరోజులు ఆగితే గాని తెలియ‌రాదు.


 వైఎస్సార్సీపీ జగన్మోహన్ రెడ్డి పార్టీ, ఆంధ్రపార్టీగా ముద్రపడిన నేపథ్యంలో అలాంటి పార్టీ అధినేత సోదరి పక్క రాష్ట్రంలో కొత్త పార్టీ పెడితే తెలంగాణ ప్రజలు ఎలా ఆమోదిస్తారనే క్వశ్చన్స్ కూడా ఉత్పన్నం అవుతున్నాయి. షర్మిల వెనుక టీఆర్ ఎస్ ముఖ్యులే ఉండే అవకాశం ఉన్నట్లుగా కొన్ని రోజులుగా ఒక ప్రచారం సాగుతోంది. బీజేపీని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగానే ‘రెడ్డి’ సామాజిక వర్గాన్ని చేరదీయడానికి యత్నాలు జరుగుతున్నట్టు వదంతులు వస్తున్నాయి. రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టే ఏర్పాట్లలో ఉన్న వైఎస్‌ షర్మిల.. ఏప్రిల్‌ 9న జనం ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఖమ్మంలో లక్ష మందితో భారీ సభ ఏర్పాటు చేసి.. అదే వేదికపై పార్టీ ప్రకటన తేదీని వెల్లడించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2003 ఏప్రిల్‌ 9న చేవెళ్ల నుంచి వైఎ్‌సఆర్‌ తన పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: