ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ విజయం సాధిస్తుందనేది చెప్పడం కాస్త కష్టంగానే ఉంటుంది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాస్త దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ప్రజల్లో మద్దతు కోసం ఎక్కువగానే కష్టపడుతున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజల్లో ఆ పార్టీకి ఎంత వరకు మద్దతు ఉన్నా సరే ఆ పార్టీ మాత్రం ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమవైపు ఎంత వరకు తిప్పుకుంటుంది అనేదానిపై అందరూ కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాస్త ఆసక్తికరంగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు.

ఇప్పటివరకు కూడా చంద్రబాబు నాయుడు అనుకూల ఓటు బ్యాంకు 2019 ఎన్నికల తర్వాత ఏర్పడలేదు అనే విషయం చెప్పవచ్చు. 2014లో చంద్రబాబు నాయుడు గెలిచారు అంటే అప్పట్లో సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం రాష్ట్ర విభజన జరగడం వంటివి జరిగాయి. అప్పట్లో ముఖ్యమంత్రి జగన్ అవినీతిపరుడు అనే అంశాన్ని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా సహా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి బాబుకి అనుకూలంగా పరిస్థితి మార్చడం జరిగాయి. అప్పుడే జగన్ జైలు నుంచి విడుదల కావడం వంటివి జరిగాయి.

ఇక ఇప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ వ్యూహం మార్చి ముందుకు వెళుతుంది అనే విషయం చెప్పవచ్చు. తనకు అనుకూల ఓటు బ్యాంకు లేదు కాబట్టి జగన్ ప్రభుత్వం అరాచకాలు చేస్తుంది అనే అంశాన్ని చంద్రబాబు నాయుడు ఎక్కువగా హైలెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి కార్యక్రమాలను అలాగే అరాచకాలను తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం అందులో భాగమే అని కొంతమంది అంటున్నారు. 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు కొన్ని వ్యూహాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లినా సరే వాటిని అధికార పార్టీ ఎదుర్కొంది అనే చెప్పాలి. ఏది ఎలా ఉన్నా సరే ఈ కొత్త వ్యూహం మాత్రం ఎంత వరకు సహకరిస్తుంది ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: