ఈ మధ్యకాలంలో డబ్బులు సంపాదించడానికి ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో రకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే ప్రతి ఒక్కరూ తమ దగ్గర ఉన్న ఆదాయం రెట్టింపు చేసుకోవడానికి  వివిధ రకాలుగా ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం వివిధ రకాలుగా ఇన్వెస్ట్ చేస్తూ దీర్ఘ కాలంలో భారీగా ఆదాయం పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు అందరు. అయితే ప్రస్తుతం ఎంతో మంది ప్రజలు తమ చేతిలో ఉన్న ఆదాయాన్ని ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న దానిలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఒకటి  అన్న విషయం తెలిసిందే.



 ఇందులో భాగంగా 15 ఏళ్ళపాటు డబ్బులు పెట్టాలి. ఏకంగా ఏడాది 1.5 లక్షల వరకు డిపాజిట్ చేసుకునేందుకు అవకాశం కూడా ఉంటుంది. ఒక పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. ఒకవేళ మీరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో ఖాతా కలిగి ఉంటే మీకు పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా కలిగే అవకాశం ఉంది. అయితే నెలకు ఐదు వేల రూపాయలు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసినా కూడా మెచ్యూరిటీ సమయంలో ఏకంగా 16 లక్షలకు పైగా ఆదాయం సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. అయితే గత ఏడాది పసిడి ఆల్టైమ్ గరిష్టస్థాయి తాకింది  అనే విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే గోల్డ్ ఈటీఎఫ్ లాంటి వాటిల్లో కూడా డబ్బులు పెట్టేందుకు అవకాశం ఉంది. ఇక  మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో దీర్ఘకాలంలో డబ్బులు పెడితే మంచి రాబడి పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా సిప్  రూపంలో ఇన్వెస్ట్  చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. నెలకు ఐదు వేలు కడితే చాలు తర్వాత పదకొండు లక్షలు పొందేందుకు అవకాశం ఉంటుంది. రికరింగ్ డిపాజిట్లు కూడా ఇలాంటి అవకాశం ఉంది. ప్రతి నెలా కొంత మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ పోతే ఆ తర్వాత భారీగా ఆదాయం పొందే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: