ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది నిరుపేదలకు ఇప్పటికి కూడా తిండి లేక అల్లాడిపోతున్నారు అన్న విషయం తెలిసిందే. ప్రతిరోజు నాలుగు వేళ్ళు  నోట్లో కి వెళ్లడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని కొన్ని సార్లు ఇక ఎలాంటి ఆహారం లేకపోవడంతో పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సామాన్య ప్రజల పరిస్థితి ఇలా ఉంటే అటు సంపన్నుల పరిస్థితి మరోలా ఉంది. అవసరం ఉన్న దానికంటే ఎక్కువగా ఆహారం చేయడం ఇక ఆ తర్వాత ఆకలి తీరగానే మిగిలిన ఆహారాన్ని మొత్తం పడేయటం  లాంటివి చేస్తున్నారు ఎంతమంది. ఇలా ఎంతో మంది ఆహారాన్ని వృధా చేస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 కేవలం ఒక ప్రాంతం ఒక రాష్ట్రం ఒక దేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇక  ఎంతోమంది తిండి లేక ఆకలితో అలమటిస్తూ ఉంటే ఇంకా ఎంతోమంది ప్రపంచంలో ఉన్న నిరుపేదలు  అందరికీ భోజనం పెట్టేంత తిండిని పారబోస్తున్నారట.  ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ ఆసక్తికర విషయాలు వెలుగులోకివచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజు ఎంతలా పిండి వృధాగా పోతుంది అన్న విషయాన్ని ఇటీవలే ఈ సర్వేలో ఆసక్తికర నిజాలు బయటపడ్డాయి.




 ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా అందరూ కలిసి పడేస్తున్న అన్నం 2019 లో ఏకంగా ఏకంగా 931 మిలియన్ టన్నులు. 40 టన్నుల బరువు ఉన్న 23 మిల్లియన్ల ట్రక్కులను ఈ వృధా చేసిన ఆహారంతో నింపవచ్చట.. ఇక ఆ మొత్తం ట్రక్కుల తో ఏకంగా ఈ భూమి ఏడుసార్లు చుట్టి  రావచ్చట . ప్రపంచ ఆహార ఉత్పత్తిలో దాదాపు ఏడు శాతం చెత్తబుట్టలోకి వృధాగా పోతుందని తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అయితే ఈ మొత్తం వృధాలో  భారత్ వాటా ఏకంగా 68 టన్నుల పైమాటే కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా వృధా అవుతున్న ఆహారం ఏ స్థాయిలో ఉందో... ఐక్యరాజ్యసమితి సర్వే నిర్వహించి ఇచ్చిన నివేదిక ఇది.

మరింత సమాచారం తెలుసుకోండి: