మద్యం తాగడం వల్ల అనేక దుష్ప్రభావాలు ఉంటాయని తెలిసినా ఎక్కువగా యువత మద్యానికి బానిసలు అవుతున్నారు. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ లో మద్యపాన నిషేధం చేయడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. దాదాపుగా మద్యం ప్రియులు తాగే అన్ని బ్రాండ్లను నిషేధించి కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టింది. అలా అయినా తాగడం తగ్గిస్తారు ఏమో అని భావిస్తే మందుబాబులు వాటిని కూడా అలవాటు చేసుకున్నారు. ఈ మద్యం మత్తులో ఏమి చేస్తున్నామో కూడా తెలియని పరిస్థితిలో పడిపోతున్నారు. అలా తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో తీవ్ర విషాదం నెలకొంది.

ముగ్గురు స్నేహితులు రైల్వే ట్రాక్ పై కూర్చుని మద్యం సేవించారు. ఎంతగా తాగారంటే ట్రాక్ మీదుగా రైలు వస్తున్న సంగతి కూడా వారికి అర్థం కాలేదు. అలా కూర్చుని మందు తాగుతున్న ముగ్గురు యువకులను వేగంగా వచ్చిన ట్రైన్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే సిద్ధూ,  భరత్, పవన్ ముగ్గురు ఏలూరు బస్టాండ్ సమీపంలోని రైల్వే ట్రాక్ మీదకి చేరుకొని నిన్న రాత్రి మద్యం సేవించారు.

ప్రస్తుతానికి అన్ని రైళ్లు తిరగడం లేదు కాబట్టి చాలా సేపు వారికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. సో వారు రైల్వే ట్రాక్ మీదనే కూర్చుని తాగుతూ ఉన్నారు. ఒకానొక దశలో ముందు ఎక్కువైపోయి ట్రాక్ మీద రైలు వస్తున్నా వీరికి పట్ట లేదు. దీంతో ట్రాక్ మీద కూర్చుండి పోయిన వారి మీద నుంచి ట్రైన్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో భరత్, సిద్దు అక్కడికక్కడే మరణించగా పవన్ కు తీవ్ర గాయాలయ్యాయి తెల్లవారుజామున వారిని చూసిన రైల్వే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని పవన్ ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: