ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ అనే మహమ్మారి కమ్మేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ప్రజానీకం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని మాస్కు ముసుగులోకి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి రోజురోజుకు దారుణ పరిస్థితులు వెలుగులోకి వస్తున్నాయి చైనాలో వెలుగులోకి వచ్చిన మహమ్మారి కరోనా వైరస్ అటు ప్రపంచ ప్రజానీకం జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది అని చెప్పాలి.  ఇక ప్రతి ఒక్కరు కూడా ఏ క్షణం లో  వైరస్ దాడి చేసి ఏ క్షణంలో ప్రాణాలను తీసుకు పోతుందో అని భయపడుతూ బ్రతకాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి రోజురోజుకు వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతూనే ఉంది.



 ఇకపోతే ఇప్పటికే అన్ని దేశాలలో కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది అన్న విషయం తెలిసిందే  వాక్సినేషన్ ప్రక్రియను శరవేగంగా జరుపుతూ అందరికీ అందే టీకా అందే విధంగా అన్ని దేశాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఇలా వ్యాక్సిన్ వేసుకోవడానికి ఎంతో మంది ప్రజలు సైతం ముందుకు వస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో కొంతమంది వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మాత్రం ఎంతో మందిని భయాందోళనకు గురిచేస్తోంది.  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఏకంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ఎంతో మంది వైద్య సిబ్బంది.



 ఏకంగా కొంతమందికి వ్యాక్సిన్ డోసులను ఎక్కువ మొత్తంలో ఇవ్వడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలకు గురయ్యేలా చేస్తున్నారు. ఎక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది వ్యాక్సిన్ వేసుకునేందుకు ఆస్పత్రికి వెళ్లిన ఓ యువతికి నర్సు అజాగ్రత్తతో 6 డోసులు ఒకేసారి ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది.  ఇటలీలోని ట్రాన్స్  నగరంలో ఆస్పత్రిలో నర్సు పరధ్యానం తో  ఫైజర్ టీకా ఆరు డోసులను సిరంజీలో నింపి ఓ యువతి ఇచ్చి తర్వాత అప్రమత్తమై ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేయగా యువతిని పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: