ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. శరవేగంగా పెరిగిపోతుంది...  అందరిపై పంజ విసురుతుండటంతో రోజురోజుకు దేశంలో విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయి.  రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య దాదాపు 4 లక్షల వరకు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు.  ఏ క్షణంలో ఈ మహమ్మారి వైరస్ దాడి చేసి ప్రాణాలు తీస్తుందో అని భయాందోళనకు గురవుతున్నారు.  ఇక ప్రస్తుత పరిస్థితుల్లో సగటు మనిషి జీవితానికి అసలు గ్యారంటీ లేకుండా పోయింది అని చెప్పాలి.



 అయితే మొదటి రకం వైరస్ తో పోల్చి చూస్తే రెండవరకం వైరస్ ఎక్కువగా ప్రభావం చూపుతుంది. వైరస్ భారిన పడిన వారు ఎంతో మంది ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు.  ఈ క్రమంలోనే ఇక ఆస్పత్రిలో పరిస్థితి విషమించి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కరోనా వైరస్ చికిత్స లో భాగంగా రేమిడిసివర్ ఇంజక్షన్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు వైద్యులు  పరిస్థితి విషమించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న కరోనా వైరస్ రోగులకు రేమిడిసివర్ ఇంజక్షను ఉపయోగిస్తున్నారు.  ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో రేమిడిసివర్ ఇంజక్షన్ ఒక్కటే కరోనా వైరస్ చికిత్సకు కేరాఫ్ అడ్రస్ గా మారి పోయింది.




 ఇలాంటి పరిణామాల నేపథ్యం లో దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితులను తగ్గించేందుకు కరోనా చికిత్సలో ఉపయోగించేందుకు సరికొత్త మందు కనిపెట్టింది డిఆర్టీవో. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఈ మందు తయారు చేసింది. జి2 డ్రగ్ పేరుతో మార్కెట్లోకి వచ్చేసింది.  ముందుగా కేవలం 10 వేలు పాకెట్స్ మాత్రమే విడుదల చేసింది డిఆర్డివో.  ఇది అచ్చం మాదిరిగానే గ్లూకోస్ లాగానే తీసుకోవాల్సి ఉంటుంది. పొడిని నీటిలో కలిపి ఇక ఆ తర్వాత నోటి ద్వారా తీసుకుంటారు. కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తి ఇది వాడితే 24 గంటల్లో  వైరస్ బలాన్ని తగ్గించి సాధారణ స్థితికి తీసుకు వస్తుంది అని పరిశోధకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: