కాబోయే ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ చెప్పు కుంటున్న రాహుల్ గాంధీ 51వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. అయితే పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా రాహుల్ గాంధీ తెర మీదకు వచ్చి కనబడిన దాఖలాలు చాలా తక్కువే. పదేళ్లపాటు మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా వ్యవహరించారు. ఆ తర్వాత ఆయన తప్పు కుంటూ రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా తెర మీదకు వచ్చినా 2014లో మోడీ హవా ముందు ఆయన నిలవ లేకపోయారు. 2019లో కూడా దాదాపు ఇదే సీన్ రిపీట్ అయ్యింది..

 అయితే కాంగ్రెస్ ఓడిపోయిన వెంటనే తాను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండలేనని చెప్పి తప్పుకున్న రాహుల్ గాంధీ ముఖ్యంగా సీనియర్ల విషయంలో చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. సీనియర్ లే అసలు పార్టీ ఇబ్బందులు పడడానికి కారణం అని భావిస్తున్న ఆయన ఎక్కువ యువతరానికి పదవులు కట్టబెట్టడానికి, బాధ్యతలు అప్పగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా రాష్ట్రాల్లో రాహుల్ కి కావాల్సింది రెబల్ గా ఉండే నాయకులు, ఏ విషయంలోనూ వెనక్కి తగ్గకుండా ప్రజల్లోకి దూసుకువెళ్ళే నాయకులు.

అలాంటి నాయకుల కోసం సీనియర్లను సైతం పక్కన పెట్టడానికి రాహుల్ ఏ మాత్రం ఆలోచించడం లేదు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో సీనియర్లు - జూనియర్లు గొడవలు జరుగుతుండగా రాహుల్ మాత్రం జూనియర్ లకే వత్తాసు పలుకుతూ వారికి పదవులు కట్టబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల బెదిరింపు ధోరణితో సీనియర్లు తాము పార్టీ వీడి వెళ్ళిపోతాను అని చెబుతున్నా సరే రాహుల్ వెనక్కి తగ్గకుండా కాంగ్రెస్ అంటే యువరక్తం అనే సందేశం ప్రజల్లోకి పంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల నాటికి రాహుల్ పూర్తి సంసిద్ధులుగా మారి ప్రధానమంత్రి అవుతారని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మరి చూడాలి అది ఎంత వరకు నిజమో అవుతుందనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: