ప్రపంచంలోనే తొలిసారిగా త్రీడీ ప్రింటింగ్ లో నిర్మించిన స్టీలు వెంతెన నెదర్లాండ్స్ ప్రారంభమైంది. ఆమ్ స్టర్ డ్యామ్ లోని ఓ కాలువపై దీన్ని నిర్మించారు. 12మీటర్ల పొడవున్న ఈ వంతెనను పూర్తిగా రోబోలే నిర్మించాయి. వెల్డింగ్ టార్చ్ ల సాయంతో పొరపొరలుగా దీన్ని నిర్మించాయి. అడుగుకు 12సెన్సార్లు ఏర్పాటు చేశాయి. ఈ సెన్సార్లు వంతెనపై పడే ఒత్తిడి, ఉష్ణోగ్రత మార్పులను సూచస్తాయి.

నెదర్లాండ్స్ లో ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జ్ కోసం 4వేల 500కిలోల ఉక్కుతో తయారు చేశారు. ఆ దేశంలో ఎంఎక్స్ త్రీడీ సంస్థకు చెందిన వారు ఈ నిర్మాణానికి పూనుకున్నారు. కేవలం మూడు రోజుల్లోనే నగరవాసులు ఉపయోగించుకునేలా చేశారు. జూలై 15న మొదలు పెట్టి జులై 18న బ్రిడ్జిని కాలువ ప్రదేశంలో ఫిక్స్ చేయడం పూర్తి చేశారు.  

రోబోలు నిర్మించిన ఈ వంతెన 12మీటర్ల పొడవుంది. నాలుగు రోబోలు చాలా తెలివిగా ఈ బ్రిడ్జిని పూర్తి చేసి ఆశ్చర్యపరిచాయి. దీన్ని రెడీ చేసేందుకు ఆరు నెలల ముందే ప్లాన్ చేశారు. వేరో చోట తయారు చేసి పడవ సాయంతో వంతెనను కాలువ ఉండే చోటికి తీసుకొచ్చారు. దీన్ని అక్కడ అమర్చడానికి మూడు రోజుల సమయం పట్టింది.

ఈ బ్రిడ్జిపై ఎక్కడైనా డ్యామేజ్ అయినా.. వెంటనే ఇన్ఫర్మేషన్ ఎంఎక్స్ త్రీడీ సంస్థ నిర్వహకులకు వెళుతుంది. ఇదే సాంకేతికతను భవిష్యత్తులో వినియోగిస్తారని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ వంతెన నిర్మాణం... విధానం సక్సెస్ కావడంతో రాబోయే రోజుల్లో ఇందే టెక్నాలజీతో పెద్దపెద్ద బిల్డింగ్ లు నిర్మిస్తారని తెలుస్తోంది. అక్కడి ఇంజినీర్లు ఇపుడు ఇలాంటి పరిశోధనలపైనే దృష్టి పెట్టారు. ఈ 3డి-ప్రింటెడ్ స్టీల్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది.

మొత్తానికి రోబోలు తయారు చేసిన బ్రిడ్జ్ నెదర్లాండ్స్ వాసులకు కొత్త అనుభూతిని కలిగిస్తోంది. ఆ బ్రిడ్జిపై నడిచేటపుడు కొంత ఆనందానికి గురవుతున్నారు. వింతవింతగా ఉన్న ఈ వంతెనపై ఫోటోలు దిగుతున్నారు కూడా.



 

మరింత సమాచారం తెలుసుకోండి: