నిరంత‌రం అణ్వాయుధాల‌ను ప‌రీక్షిస్తూ అంత‌ర్జాతీయంగా వార్తల్లో నిలిచే దేశం అది. ఇత‌ర దేశాల‌తో ఎక్కువ సంబంధం లేకుండా రహ‌స్యంగా ఉంటుంది. అలాంటి దేశం ఇప్పుడు తీవ్ర ఆహార సంక్షోభంలో కూరుకుపోతోంది. దీనికి కార‌ణం క‌రోనా వైర‌స్ మిగిల్చిన పుణ్యమే.. ఈ వైర‌స్‌ కారణంగా పేద ధ‌నిక దేశాలు అనే తేడా లేకుండా సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా పేద దేశాలు ఆహార, ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటాయని అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం విధిత‌మే.. గ‌తంలో ముఖ్యంగా ఉత్తర కొరియాలో సంక్షోభం ఏర్పడవచ్చనే ఐరాస వెలువ‌రించిన నివేదిక‌లు ఇప్పుడు నిజ‌మ‌వుతున్నాయి.

ఆ దేశ అధ్య‌క్షుడు ఎప్పుడు కూడా ఆ దేశ ప‌రిస్థితుల‌పై స్పందించ‌డు. తొలిసారిగా దేశంలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై కిమ్ స్పందించారు. రెండు రోజుల క్రితం యేర్పాటు చేసిన పార్టీ ప్లీనరీ సమావేశంలో కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడారు. అయితే దేశంలో ఆహార సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని కి మ్ ఆం దోళన వ్యక్తం చేశాడు. ఈ సంద‌ర్భంగా ఆహార ఉత్ప‌త్తుల‌ను పెంచి సంక్ష‌భ నివార‌ణ‌కు చ‌ర్య‌ల‌ను తీసుకోవాల‌ని అదికారుల‌ను కిమ్ ఆదేశించారు. క‌రోనా నియంత్ర‌ణ‌కు ఇంకొంత కాలం లాక్‌డౌన్ ఆంక్ష‌లు కొన‌సాగుతాయ‌ని, ప్ర‌జ‌లు దీనికి సిద్దంగా ఉండాల‌ని సూచించారు.

  ప్ర‌పంచం మొత్తం కరోనాతో విలవిలలాడుతుంటే ఉత్తర కొరియా మాత్రం తమ దేశంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదుకాలేదని చెబుతూ వ‌స్తోంది. చైనాలో కొవిడ్ వ్యాప్తి మొద‌ల‌యిన‌ప్ప‌టి నుంచి త‌మ దేశంలో లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌తో పాటు స‌రిహ‌ద్దుల‌ను కూడా మూసివేసింది. అలాగే చైనాతో వాణిజ్య కార్య‌క‌లాపాల‌ను త‌గ్గించంతో ఉత్త‌ర‌కొరియా ఆర్థిక వ్య‌వ‌స్థ మ‌రింత క్షీణిస్తున్న‌ట్టు తెలుస్తోంది. క‌రోనాకు తోడు గ‌తేడాది ఆ దేశంలో సంభవించిన ప్ర‌కృతి వైప‌రిత్యాల‌తో ఆహారోత్ప‌త్తి గ‌ణ‌నీయంగా క్షీణించింది. ఉత్త‌ర కొరియా ల‌క్ష‌ల ట‌న్నుల ఆహార కొర‌త‌ను ఎదుర్కోనుంద‌ని ద‌క్షిణ కొరియాకు చెందిన కొరియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఇటీవ‌ల పేర్కొంది. దీంతో అక్క‌డి ప్ర‌జ‌లు ఆహార కొర‌త‌తో తీవ్ర స‌మ‌స్య‌లు ఎదుర్కొనున్న‌ట్టు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.



అయితే ఉత్తర కొరియాలో కిలో అర‌టి పండ్లు రూ.3వేల‌కు పైగా, బ్లాక్‌ టీ ప్యాకెట్‌ ధర రూ.5 వేలు, కాఫీ ప్యాకెట్‌ ధర రూ.7 వేలుగా ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్‌లో నిత్యావసరాల ధరలు ఈ విధంగా ఆకాశాన్ని తాకాయి.  దాదాపు 8 లక్షల 60 వేల టన్నుల ఆహార కొరతను ఉత్త‌ర కొరియా ఎదుర్కొంటున్నట్లు ఐక్యరాజ్యసమితి ఆహార విభాగం (FAO) అంచనా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: