క‌రోనా మూలాలు చైనాలోనే ఉన్నాయ‌ని గ‌త కొద్ది రోజులుగా అంత‌ర్జాతీయంగా ప‌లు దేశాలు ఆరోపిస్తూ వ‌స్తున్నాయి. ఇదే క్ర‌మంలో కరోనా వైరస్ ఆరిజిన్ ప్రోబ్ కోసం WHO ప్రణాళికను రూపొందించింది. అయితే ఈ ప్ర‌ణాళిక‌ల‌ను చైనా తిరస్కరించింది. కరోనా వైరస్ మొట్టమొదటి కేసు 2019 డిసెంబర్‌లో మధ్య చైనా నగరమైన వుహాన్‌లో వెలువడ్డ విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి డ్రాగ‌న్ కంట్రీపై అనుమానాలు మొద‌ల‌య్యాయి.

  ఇదే క్ర‌మంలో ఈ నెల‌లో క‌రోనా వైర‌స్ మూల‌ల అధ్య‌య‌నం గురించి రెండ‌వ ద‌శ ద‌ర్యాప్తు కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఏర్పాటు చేసిన ప్ర‌ణాళిక‌ల‌ను గురువారం చైనా తిరస్క‌రించింది. అయితే క‌రోనా వైర‌స్ చైనాలోని ప్ర‌యోగ‌శాల నుంచి బ‌య‌ట‌కు  వ‌చ్చిన‌ట్టు అనుమానం కూడా ఉంది.
దీంతో WHO వుహాన్ నగరంలోని ప్రయోగశాలలు మరియు మార్కెట్లను ఆడిట్ చేయ‌నుంది పార‌ద‌ర్శ‌క‌తగా అధ్య‌య‌నం చేయాల‌ని అధికారుల‌కు పిలుపునిచ్చింది.

  దీనిపై స్పందించిన ఆ దేశ జాతీయ ఆరోగ్య క‌మిష‌న్ (ఎన్‌హెచ్‌సి) ఉపాధ్యక్షుడు జెంగ్ యిక్సిన్ విలేకరులతో మాట్లాడారు. కొన్ని కోణాల్లో, ఇంగితజ్ఞానాన్ని విస్మరించి, విజ్ఞాన శాస్త్రాన్ని ధిక్కరిస్తున్నందున మేము అలాంటి మూలాన్ని గుర్తించే ప్రణాళికను అంగీకరించం అని ఆయ‌న తెలిపారు. అయితే చైనా నిపుణులు మ‌రియు స‌ల‌హాల‌ను WHO ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌న్నారు. ఈ విష‌యం శాస్త్రీయమైన‌ద‌ని కొవిడ్ 19 మూలాల‌ను క‌నుగొన‌డంలో రాజ‌కీయ జోక్యాన్ని పూర్తిగా వ‌దిలివేయాల‌ని కోరుతున్న‌ట్టు జెంగ్ యిక్సిన్ తెలిపారు. ఈ అధ్య‌య‌నాన్ని రాజ‌కీయం చేయ‌డాన్ని వ్య‌తిరేకిస్తున్న‌ట్టు చైనా వివ‌రించింది.


అయితే క‌రోనా వైరస్ మూలం క‌నుగొన‌డం నిపుణుల మధ్య పోటీగా మారింది. మొట్ట‌మొద‌టి కొవిడ్ కేసు  2019 డిసెంబర్‌లో సెంట్రల్ చైనాలోని వుహాన్ న‌గ‌ర‌లో వెలుగు చూసింది.  వుహాన్‌లోని జంతువుల‌ను అమ్మే మార్కెట్ల నుంచి మ‌నుషుల‌కు వ్యాపించి ఉండ‌వ‌చ్చని ప‌లువురు న‌మ్ముతున్నారు. ఇదే క్ర‌మంలో మే నెలలో యు.ఎస్. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చైనాలోని ప్రయోగశాల నుంచే ఈ వైర‌స్ బ‌య‌ట‌ప‌డిన‌ట్టు  ప్రత్యర్థి సిద్ధాంతాలను అనుసరిస్తుంద‌ని ఆరోపించింది.

  అయితే ఇత‌ర అధికారులు మ‌రియు చైనా నిపుణుల‌తో క‌లిసి క‌రోనా మూలాల‌ను క‌నుగోన‌డానికి చైనాతో పాటు ఇత‌ర దేశాలలో కూడా అధ్య‌య‌నం చేసే ప్ర‌య‌త్నాలు చేయాల‌ని జెంగ్ డబ్ల్యూహెచ్‌ఓను కోరారు.
ల్యాబ్ నుంచి వైర‌స్‌ లీక్ చాలా అరుదు అని తాము నమ్ముతున్నామని, ఈ విషయంలో ఎక్కువ శక్తితో పాటు ప్రయత్నాలను, పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు అని WHO ఉమ్మడి నిపుణుల బృందంలోని చైనా జట్టు నాయకుడు లియాంగ్ వానియన్ పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: