ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నాయ్. అయితే కొన్ని దేశాలు మాత్రమే వ్యాక్సిన్లు తయారు చేసాయ్. ఈ క్రమంలోనే ఇక ఆయా దేశాలకు చెందిన టీకాలనే ప్రపంచ దేశాలు వాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఉపయోగిస్తున్నాయి. ఈ క్రమంలోనే కరోనా వైరస్ కు కారణం అయిన చైనా కూడా వ్యాక్సిన్ తయారు చేసాము అంటూ తెలిపింది. అయితే మొదటి నుంచి దీనికి సంబంధించిన పూర్తిస్థాయి క్లినికల్  ట్రావెల్స్  కు సంబంధించిన సమాచారం మాత్రం బయట పెట్టడం లేదు చైనా.  ఈ క్రమంలోనే చైనా కు సంబంధించిన వ్యాక్సిన్ ను బ్రెజిల్ ఇండోనేషియా లాంటి దేశాలు కూడా తమ తమ దేశంలోకి దిగుమతి చేసుకున్నాయి.



 కానీ ఆ తర్వాత మాత్రం క్రమక్రమంగా చైనా వ్యాక్సిన్ పై ఆయా దేశాలు నిషేధం విధిస్తూ వచ్చాయి అన్న విషయం తెలిసిందే. చైనా వ్యాక్సిన్ వల్ల దుష్ప్రభావాలు వస్తున్నానని అంతే కాకుండా ఎక్కువ యాంటీబాడీలు వృద్ధి కావడం లేదు అంటూ ఆయా దేశాలు తెలిపాయ్.  చైనా శాస్త్రవేత్తలు కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇటీవల చైనా వ్యాక్సిన్ అయినా సినో వాక్ బయోటెక్ యొక్క  వ్యాక్సిన్ గురించి ఇటీవలే ఒక విషయం బయటపడింది. ఏకంగా చైనాకు చెందిన వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారిలో కేవలం తక్కువ మోతాదులో యాంటీబాడీస్ను ఉత్పత్తి అయినట్లు గుర్తించారు. మొదటి డోసు తీసుకున్న తర్వాత 16.9 శాతం..  రెండో తీసుకున్న తర్వాత 35.2 శాతం మాత్రమే యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యాయట.



 ఇది కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. అయితే బూస్టర్ డోస్ ఇవ్వడం వల్ల బాగా యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ ఇప్పటికే చైనా సంబంధించిన సినోవాక్ వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకుని ఇక మొదట వ్యాక్సినేషన్ ప్రక్రియలో  భాగంగా అందరికీ రెండు డోసులు ఇచ్చాయ్ ఆయా దేశాల ప్రభుత్వాలు.  ఈ క్రమంలోనే మూడవ బూస్టర్ డోస్ కోసం ఇక చైనాకు చెందిన వ్యాక్సిన్ కాకుండా ఇతర దేశాలకు చెందిన టీకా ఇవ్వడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలోనే మొన్నటివరకు చైనా టీకాలు వేసిన ఇండోనేషియా థాయిలాండ్ లో ప్రస్తుతం వరుసగా మేడర్నా..  లేదా ఫైజర్ టీకా మూడో డోసు బూస్టర్ డోస్ గా ఇస్తున్నారు. ఇక అటు టర్కీలో కూడా సినోవాక్ టీకాకు బదులుగా మూడవ మోతాదు పైజర్ టీకా ఇస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: