నాగార్జునసాగర్  ఉప ఎన్నికల్లో  భారతీయ జనతా పార్టీ  చేసినటువంటి తప్పిదాన్ని  హుజురాబాద్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ కూడా  పాటిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.ఆ ఉప ఎన్నికల్లో   టీఆర్ఎస్ అభ్యర్థిని  ప్రకటించెంతవరకు బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించక పోవడం వల్ల,   అక్కడ కనీసం ఓట్లు రాక ఓడిపోయింది. అదే స్ట్రాటజీని  కాంగ్రెస్ కూడా పాటిస్తుందని చెప్పవచ్చు. రాజకీయాలలో ముఖ్యమంత్రి కేసీఆర్  అనుసరించే అటువంటి  వ్యూహాలు చాలా ఆసక్తిగా ఉంటాయి. ఆయన ఉపయోగించే స్ట్రాటజీ  తమ పార్టీని గెలిపించుకోవడమే కాక, ఇతర పార్టీలను కూడా  ఇబ్బందులు పడేలా చేయడంలో కెసిఆర్ దిట్ట అని చెప్పవచ్చు. ఎన్నికల విషయంలోకి వస్తే అభ్యర్థి ఎంపికలో కెసిఆర్ అనుసరించే విధానం  ఏ ఒక్కరికి అంతుచిక్కవు.

దీనిలో  ఆయన ఎత్తులు, ప్రత్యర్థులు అర్థం చేసుకోలేని విధంగా ఉంటాయి. సాగర్ ఉప ఎన్నికల్లో కూడా అదేవిధంగా వ్యవహరించి  భారీ మెజారిటీతో టిఆర్ఎస్ అభ్యర్థి ని గెలిపించారు. ఈ విధంగా ఇతర పార్టీలను కన్ఫ్యూజ్  చేసి   సందిగ్ధంలో పడేస్తాడు. కెసిఆర్ వ్యూహం అర్థం చేసుకోలేక , బీజేపీ పార్టీ సాగర్ ఉప ఎన్నికల్లో  ఛతికిల పడింది. నాగార్జునసాగర్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ  ఏ విధమైన తప్పిదం చేసిందో  హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఆ విధంగానే వ్యవహరిస్తోంది అని చెప్పవచ్చు. హుజురాబాద్ బీజేపీ అభ్యర్థిగా  మాజీ మంత్రి ఈటెల రాజేందర్  పోటీలో ఉంటారు. టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించే ప్రక్రియలో  ముఖ్యమంత్రి కేసీఆర్  బిజీగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ విషయానికి వస్తే అభ్యర్థి ఎవరు అనేదానిపై  ఇంకా క్లారిటీ రాలేదు. కనీసం కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై కసరత్తు కూడా మొదలుపెట్టినట్లు కనిపించడం లేదు. ఎందుకంటే  టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే, కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నదని  అంటున్నారు. ఇదే జరిగితే మాత్రం నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ  ఏ విధంగా అయితే చతికిలా పడిందో ఆ విధంగానే కాంగ్రెస్ కూడా అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.

 తెలంగాణలో  కెసిఆర్ కు దీటైన నాయకుడు  రేవంత్ అవుతాడని అందరూ భావిస్తున్న సమయంలో హుజురాబాద్  కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకపోవడం వెనుక ఆంతర్యం ఏమున్నదని, కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. కానీ హుజురాబాద్ అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం  రేవంత్ రెడ్డి  నాగార్జునసాగర్ లో బీజేపీ ఏవిధంగా అయితే తప్పు చేసిందో అదే విధంగా వ్యవహరిస్తోందని చెప్పవచ్చు. కానీ రేవంతు  ఈ విషయంలో ఇంకా భిన్నంగా ఆలోచిస్తారా.. లేక సాగర్ లో బిజెపి పాటించిన విధానాన్ని ఫాలో అవుతారు అన్నది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: