న‌ష్టాల‌లో ఉన్న ఆర్టీసీకి నిన్న‌టి వ‌ర‌కూ పెద్ద దిక్కే లేదు. ఎండీగా వ‌చ్చిన స‌జ్జ‌నార్, చైర్మ‌న్ గా వ‌చ్చిన బాజిరెడ్డి గోవ‌ర్థ‌న్ ఏ మేర కు ప‌ని చేస్తారో అన్న‌ది ఇప్పుడిక ఆస‌క్తిదాయకంగా మారింది. సంస్క‌ర‌ణ‌కు నిత్యం చిరునామాగా నిలిచే సిన్సియ‌ర్ ఆఫీస‌ర్ల కార ణంగానే ఆర్టీసీకి పూర్వ వెలుగు లేదా వైభ‌వం రావాలి. అందుకు బాజిరెడ్డి కూడా స‌హ‌క‌రించాలి. ఆర్టీసీ  విలీనంపై ఎలానూ సందే హాలున్నాయి క‌నుక ఆ సంగ‌తి అటుంచి సిబ్బందికీ, సంస్థ‌కూ మంచి పేరు తెచ్చే ప‌నులు ఇక‌పై అయినా చేప‌ట్టాలి. బ‌స్సుల్లో తరుచూ ప్ర‌యాణించేందుకు స‌జ్జ‌నార్ ప్రాధాన్యం ఇస్తుండ‌డంతో కొన్ని స‌మ‌స్య‌లు వెలుగు చూసినా అవి వెంట‌వెంట‌నే ప‌రిష్కారం అ యితేనే మేలు.లేదంటే ఇదంతా ప్ర‌చార ఆర్భాటం కోస‌మే అన్న‌ది పైకి తేలిపోతుంది. అలా కాకుండా చేయగ‌ల స‌మ‌ర్థ‌త స‌జ్జ‌నార్ లో ఉంద‌నే భావించాలి. అదేవిధంగా ర‌ద్దీగా ఉన్న కూడ‌ళ్ల లో నిర్దేశించిన స్టాపింగ్ పాయింట్ల ద‌గ్గ‌ర‌, బ‌స్ షెల్ట‌ర్ల ద‌గ్గ‌ర మ‌హిళ‌ల‌కు ఏ పాటి భ‌ద్ర‌త ఉందో కూడా ఓ సారి  ప‌రిశీలించాల్సిన బాధ్య‌త కూడా కొత్త ఎండీదే! ఇవ‌న్నీ ఎలా ఉన్నా ఈ సారి మ‌రో వినూత్న‌త‌ను తెర‌పైకి తెచ్చారు. ఆ వివ‌రం ఇక్క‌డ చ‌ద‌వండిక‌.


వార్త‌ల్లో ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ నిలిచారు మ‌ళ్లీ. గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా త‌న కుటుంబ స‌భ్యుల‌తో గ‌ణేశ ప్ర‌తిమ‌ను ఒళ్లో పెట్టు కుని సామాన్యుడిలానే ప్ర‌యాణించి, అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. స‌జ్జనార్ ఎండీగా బ‌రిలో దిగాక ఇప్ప‌టిదాకా అనేక కీల‌క మార్పు లు అన్నవి ఆర్టీసీలో చోటుచేసుకున్నాయి. మ‌హాత్మా గాంధీ బ‌స్ స్టేష‌న్ ను కూడా ఆయ‌న ఇటీవ‌లే సామాన్య ప్ర‌యాణికుడి మాది రి బ‌స్సులో ప్ర‌యాణించి అక్క‌డికి చేరుకుని త‌నిఖీలు చేశారు.ఈ సంద‌ర్భంగా ఖాళీగా ఉన్న షాపులు చూసి, వీటిని అద్దె కు ఇచ్చి సంస్థ‌కు ఆదాయం తీసుకుని రావాల‌ని ఆదేశించారు. మ‌రుగ‌దొడ్ల నిర్వ‌హ‌ణ‌పై ఆయ‌న ఫైర్ అయ్యారు. ఇవే కాక మ‌రికొన్ని సూచ న‌లు కూడా చేశారు. ఇవ‌న్నీ త్వ‌ర‌లోనే అమ‌లు చేయాల‌ని స్ప‌ష్టంగా అధికారుల‌కు చెప్పివ‌చ్చారు.  మ‌రోవైపు ఆర్టీసీ న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల‌పై కూడా ఆయ‌న దృష్టి సారించారు. సిబ్బంది క‌ష్టాల‌ను తీర్చేందుకూ తాను ముందుంటాన‌ని హామీ ఇస్తున్నారు. సామాజిక మాధ్య‌మాల్లోనూ ఆర్టీసీ కాంప్లెక్సుల‌లో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌పై వ‌స్తున్న పోస్టుల‌ను ఆయ‌న చ‌దివి, వెంట‌నే స్పందిస్తున్నారు. ఆర్టీసీ బ‌స్సులపై అశ్లీల చిత్రాలను అంటించేదే లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఆదాయం కోసం సంస్కృతిని దిగ‌జార్చే ప‌నులు తాను చేయ‌న‌ని స్ప‌ష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tg