జూబ్లీహిల్స్ పి ఎస్ వన్ డ్రైవ్ ఇన్ హోటల్ వ్యవహారం ఇప్పుడు సంచలనం అయింది. దీనిపై జూబ్లీహిల్స్ ఎస్సై నవీన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈనెల 22వ తారీఖున ఓ యువతి ఫిర్యాదు చేసింది అని ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లోని వన్ డ్రైవ్ రెస్టారెంట్ వాష్ రూమ్ లో సీక్రెట్ ప్లేస్ లో మొబైల్ కెమెరా అమర్చారని అని వివరించారు. వన్ డ్రైవ్ ఇన్ ఫుడ్ కోర్టు లో నిందితుడు మైనర్ బాలుడు అరు నెలలుగా ఈ హోటల్ లో పని చేస్తున్నాడు అని తెలిపారు. పర్సనల్ పని కోసం యువతి బాత్ రూం వెళ్ళినప్పుడు సీక్రెట్ ప్లేస్ లో యువతి మొబైల్ ఫోన్ గమనించింది అన్నారు.

వెంటనే మేనేజ్మెంట్ వారి దృష్టికి ఆ తర్వాత పోలీసుల దృష్టికి తీసుకు వచ్చింది అని ఆయన పేర్కొన్నారు. మైనర్ బాలుడు వారం రోజుల క్రితమే ఆ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడు అన్నారు. వాష్ రూమ్ లో వీడియో చిత్రీకరించే సమయంలో ఫోన్ లో సిమ్ కార్డ్ లేదు అన్నారు ఆయన. 14 వేలకు ఫోన్ కొన్నాడు  అని తన ఫోన్ నుండి ఎవరికీ ఆ వీడియోలు పంపినట్లు తాము కనుగొనలేదని తెలిపారు. హోటల్ యజమాని చైతన్య పి ఎస్ కు పిలిపించి విచారించామని అన్నారు. హోటల్ లో వున్న అక్కడి సీసీటీవీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నాం అని తెలిపారు.

తమ ఫుటేజ్ ఉందా అని పోలీస్ స్టేషన్ కు ఎవరూ రాలేదు అన్నారు. కేశవ్ వ్యక్తి అక్కడ ఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్నాడు అని అతని ప్రమేయం ఏముందో తెలియాలి అని వ్యాఖ్యానించారు. నిందితుడిది సైకో మనస్తత్వం ఉంది అని అప్పుడే మతిమరుపు ఉంది అంటున్నాడు అని తెలిపారు. కేసులో ప్రమేయం వున్న వారు అందరినీ విచారిస్తాం అని ఎస్సై వివరించారు. ఒక్కడే ఈ చర్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది అని ఆయన పేర్కొన్నారు. మైనర్ బాలునిపై ఐపీసీ 354 సి ఐపీసీ 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాము అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts