అమెరికా ప్రారంభం నుండి కరోనా ను లెక్కచేయలేదు, దీనితో అక్కడ ఇంకా లక్షలలో కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. రోజు ఎంతో మంది మృత్యువాత పడుతూనే ఉన్నారు. మొదటిలో కరోనా జాగర్తలు తీసుకోవాలని సూచించినప్పటికీ ఎవరి స్వేచ్చకు అడ్డు పడరాదు అనే నినాదంతో పీకల వరకు కరోనా ప్రమాదంలో మునిగిపోయింది అమెరికా. ఇప్పటికి కేసుల సూచీలో ప్రధమ స్థానంలోనే కొనసాగుతుందంటే అక్కడి ప్రజలు మరియు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నది అర్ధం అవుతుంది. అయితే ఆర్థికంగా ఎంతో ముందు ఉన్న అమెరికా కూడా ఈ స్థితిని తట్టుకోలేకపోయింది విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతలో ఆఫ్ఘన్ నుండి అమెరికా బలగాలు వెనక్కు రప్పించడంతో ఈ విమర్శలు ఎక్కువ అయ్యాయి. ఏది ఏమైనా కరోనా ను అమెరికా లైట్ తీసుకోవడం తో అగ్రస్థానం నుండి బలవంతంగా తప్పుకున్నట్టే కనిపిస్తుంది ఆ దేశం.

ఆర్థికంగా ఎంత ముందు ఉన్నప్పటికీ సమయానికి అవి ఉపయోగపడకపోతే లాభం ఏమి ఉండదని అమెరికా లో కరోనా ఉదృతి మరోసారి నిరూపించింది. దీనితో మళ్ళీ పుంజుకోవడానికి, పెద్దరికాన్ని తెచ్చుకోవడానికి వ్యాపార లావాదేవీలు ప్రారంభించడమే మంచిదని యోచించినట్టుగా ఉంది. అందరు వాక్సినేషన్ అంటున్నారు కాబట్టి దానికంటే కొత్తగా ఏదైనా తేవాలి అని చెప్పి, అందరికి బూస్టర్ డోస్ కూడా అవసరం అనే స్టాంప్ వేయాలని చూసింది. దానిని భారీగా ఉత్పత్తి చేసి పెట్టుకొని ఆయా దేశాలతో వ్యాపార లావాదేవీలు ప్రారంభించింది.  ఒకపక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ వాక్సినేషన్ డోసుల గురించి స్పష్టమైన సూచనలు చేస్తున్నప్పటికీ బూస్టర్ డోస్ గురించి అమెరికా ప్రపంచంపై ఒత్తిడి తేవడానికే చుస్తూండటం ఆ దేశవ్యాపార లక్షణం అని విమర్శిస్తున్నారు.

అమెరికా బూస్టర్ డోస్ పై కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటన చేసింది. ఎవరికైన బూస్టర్ డోస్ అవసరం లేదని, ముఖ్యంగా రెండు డోసులు వాక్సినేషన్ తీసుకున్న వారికి దానితో అసలు అవసరం ఉండబోదని తేల్చిచెప్పింది. ఇక ఒకసారి కరోనా వచ్చి బ్రతికి బయటపడ్డ వారికి అసలు ఒక్క డోసుతో సరిపెట్టినా కూడా శరీరంలో కావాల్సిన యాంటీబాడీలు తయారవుతాయని చెప్పింది. ఇంత స్పష్టంగా ఆరోగ్య సంస్థ సూచిస్తున్నప్పటికీ, అమెరికా ప్రపంచం ముందు మళ్ళీ తన ఆధిపత్యాన్ని చూపించుకోవడానికే అలాగే వ్యాపార లావాదేవీల కోసం బూస్టర్ డోస్ అవసరం అని చెప్తుండటం అనేక విమర్శలకు తెరతీస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: