కాంగ్రెస్ పార్టీ కి కొత్త త‌ల నొప్పులు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే చాలా రాష్ట్రాల‌లో ప‌ట్టు ను కోల్పోతుంది. దీంతో పాటు అధికారం ఉన్న రాష్ట్రా ల‌లో వ‌ర్గ పోరులు న‌డుస్తున్నాయి. కాంగ్రెస్ ఢిల్లీ పెద్ద‌ల‌కు రాష్ట్ర‌ల లో ఉన్న నాయ‌కుల మ‌ధ్య స‌యోద్య కుద‌ర్చ‌డానికే స‌మ‌యం స‌రిపొతుంది. కాంగ్రెస్ కు ఉన్న వ‌ర్గ పోరులో చాలా మంది సినీయ‌ర్ కాంగ్రెస్ నాయ‌కులు పార్టీ ని వీడి పోతున్నారు. వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్న కాంగ్రెస్ కు రాష్ట్రాల‌లో వ‌ర్గ పోరు టెన్ష‌న్ పెట్టిస్తుంది. ఈ వ‌ర్గ పోరుల వ‌ల్ల నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పార్టీ ని వీడడంతో ఆయా రాష్ట్రా ల‌లో పార్టీ బ‌ల‌హీన ప‌డుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.
ఇప్ప‌టికే పంజాబ్ రాష్ట్రంలో వ‌ర్గ పోరు తారా స్థాయి చేరింది. ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి అమ‌రీంద‌ర్ సింగ్ త‌న ప‌ద‌వి రాజీనామా చేసేంత వ‌ర‌కు వ‌ర్గ పోరు సాగింది. అక్క‌డి పీసీసీ చీఫ్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధు కు కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ ప‌డ‌టం లేదు. దీంతో అమ‌రీంద‌ర్ సింగ్ త‌న సీఎం ప‌ద‌వీ రాజీనామా చేసి సిద్దు పై సంచల‌న వ్యాఖ్య‌లు చేశారు. పంజాబ్ ప‌రిస్థితి ని స‌ద్ధు మ‌ణిగించ‌డానికి కాంగ్రెస్ అధిష్టానానికి త‌ల ప్రాణం తోక‌కు వ‌చ్చింది. ఇప్ప‌టికే మ‌ధ్య ప్ర‌దేశ్ లో వ‌ర్గ పోరు చేత కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మే కూలిపోయింది. అక్క‌డ కాంగ్రెస్ అధిక స్థాన‌ల‌లో గెలిచి ప్ర‌భుత్వాన్నిఏర్పాటు చేసింది. కానీ ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి క‌మ‌ల్ నాథ్ కు యువ నాయ‌కుడు జ్యోతి రాదిత్య సింధియా కు వ‌ర్గ పోరు న‌డిచింది. చివ‌రికి జ్యోతి రాదిత్య సింధియా త‌న వ‌ర్గం ఎమ్మేల్యే లు 25 మంది తో బీజేపీ లో చేరాడు. దీంతో మ‌ధ్య ప్ర‌దేశ్ లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూలిపోయింది.
ఇప్పుడు రాజ‌స్థాన్ లో కూడా వ‌ర్గ పోరు ముదురు తుంది. రాజ‌స్థాన్ లో ముఖ్య మంత్రి అశోక్ గెహ్లోత్ కు సీనియ‌ర్ నాయ‌కుడు స‌చిన్ పైలెట్ కు అధికార పోరు న‌డుస్తుంది. అది చిలికి చిలికి గాలి వాన కాక ముందే చ‌క్క దీద్దాల‌ని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. అందుకు అనుకూలంగా అడుగులు వేస్తుంది. ఇప్ప‌టికే రాజ‌స్థాన్ రాజ‌కీయాల‌పై నాజ‌ర్ పెట్టారు. తాజాగా స‌చిన్ పైలెట్ తో రాహుల్ గాంధీ భేటీ కూడా అయ్యారు. రాజ‌కీయ సంక్షోభం రాజ‌స్థాన్ లో రాకుండా ఉండ డానికి రాహుల్ గాంధీ ప్ర‌య‌త్నిస్తున్నారు.  రాహుల్ గాంధీ ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లం అవుతాయా.. లేదా పంజాబ్‌, మ‌ధ్య ప్ర‌దేశ్ లాగే రాజ‌స్థాన్ లో కూడా రాజ‌కీయ సంక్షోభం వస్తుందా.. అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: