తాలిబన్ లు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుండి అక్కడ రోజుకు ఒక అరాచకం జరుగుతూనే ఉంది. వాళ్ళు మొదట చెప్పిన విషయాలు ఏ ఒక్కటి అమలు చేయకపోగా, చేస్తాం అని మళ్ళీ మళ్ళీ మాట తప్పుతూనే ఉన్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి తాలిబన్ లపై విచారణ చేయాలని నిర్ణయించింది. గత అమెరికా తో జరిగిన చర్చలలో తాలిబన్ లు తమ ప్రభుత్వాన్ని అస్థిర పరిచే ఏ కార్యక్రమాలు చేపట్టినా ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదని హెచ్చరించిన నేపథ్యంలో ఐరాస నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొద్దికొద్దిగా ప్రపంచ దేశాలు ఆ దేశం పై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. దీనితో ఐరాస కూడా అడుగు ముందుకు వేసి తాలిబన్ లు చెప్పినట్టుగా లేరని అందుకే విచారణ ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం చేసింది.

తాము ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వంలో కనీస ప్రాధాన్యత మహిళలకు ఉంటుందని మొదటి నుండి చెప్పటమే కానీ ఇంతవరకు దానిని అమలు చేయలేదని ఐరాస పేర్కొంది. అలాగే దేశంలో శాంతిని నెలకొల్పుతామని చెప్పినప్పటికీ దానికి కూడా ఇంతవరకు స్పష్టత, మహిళలకు స్వేచ్ఛను ఇచ్చే విషయంలోనూ తాలిబన్ లు తమ మాట నిలబెట్టుకోలేదని ఐరాస స్పష్టం చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటి కూడా తాలిబన్ లు చెప్పింది చేయకపోగా అక్కడ ఉన్నవారి జీవితాలు రోజు రోజుకు క్షిణించిపోతున్నా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ఐరాస తీవ్రంగా పరిగణిస్తుంది.

ఈ నేపథ్యంలోనే ఆయా విషయాలపై స్పష్టమైన కార్యాచరణ తాలిబన్ లు చేపట్టబోయేది ఉందా లేదా అనేదానిపై విచారణ జరుగనుంది. ఒక వేళ తాలిబన్ ల నుండి ఆశాజనకమైన సమాధానం లేని పక్షంలో వారిపై చర్యలు తప్పవని, దానికి సిద్ధంగా ఉండాలని ఐరాస స్పష్టం చేసింది. ఒక ప్రజాస్వామ్య దేశాన్ని కూల్చేసి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం అని చెప్పడం తప్ప ఇంతవరకు దానికి తగిన కార్యాచరణ ఎక్కడ కనిపించలేదని, ఇలాగే తాము ఉంటామంటే ఐరాస చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని తేల్చి చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

uno