బొగ్గు కొరతతో దేశ మంతా అల్లకల్లోలం అవుతోంది. ఇప్పటికే దేశంలోని అన్ని ధర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కూడా బొగ్గు నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయి. చాలా కేంద్రాల్లో అయితే బొగ్గు లేక పోవడంతో... ఇప్పటికే ఉత్పత్తి నిలిపి వేశారు కూడా. కొన్ని రాష్ట్రాల్లో అయితే దాదాపు 75 శాతం విద్యుత్ ఉత్పత్తి పడిపోయింది. డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేక పోవడంతో... దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా విద్యుత్ కోతలు మొదలయ్యాయి. విద్యుత్ వినియోగం తగ్గించాలని ఇప్పటికే అన్ని రాష్ట్రాలు ఆయా రాష్ట్ర ప్రజలకు సూచించాయి కూడా. బొగ్గు సరఫరా చేసేందుకు కూడా కృషి చేస్తున్నట్లు కేంద్ర ఇంధన శాఖ మంత్రి స్వయంగా ప్రకటించారు. అన్ని రాష్ట్రాలకు బొగ్గు అందించాలని ఇప్పటికే సింగరేణి కాలరీస్ సంస్థను కేంద్రం ఆదేశించింది కూడా. దేశంలో 135 ధర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 115 ధర్మల్ ప్లాంట్లకు బొగ్గు కొరత ఉంది. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని కూడా కేంద్ర ఇంధన శాఖ వెల్లడించింది. బొగ్గు సంక్షోభం దేశాన్ని కుదిపేస్తోంది కూడా.

ఓ వైపు పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే... కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. బొగ్గు సంక్షోభం అంటే ఏమిటని ఎదురు ప్రశ్నించారు. బొగ్గు కొరత అనే మాటే లేదన్నారు నిర్మలా సీతారామన్. అలాంటి వార్తలే నిరాధారమంటూ కొట్టి పారేశారు నిర్మలా సీతారామన్. ప్రస్తుతం దేశంలో విద్యుత్ కొరత లేదన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి... మిగిలు విద్యుత్ ఉందని వెల్లడించారు. అసలు ధర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గిందనే వార్తల్లో వాస్తవం లేదన్నారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దేశంలో ఉత్పత్తి అనేది పూర్తిస్థాయిలో ఉందన్నారు. కేవలం విద్యుత్ వాడకం పెరగడం వల్ల డిమాండ్ పెరిగిందని.... అందుకే ప్రస్తుతం సంక్షోభం తలెత్తిదన్నారు ఆర్థిక శాఖ మంత్రి. బొగ్గు సరఫరా వ్యవస్థ గతంలో మాదిరే నిరంతరం కొనసాగుతోందన్న నిర్మలా సీతారామన్.... ఎక్కడా దెబ్బ తినేలేదన్నారు. సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి భారత్‌లో కొనసాగుతోందన్నారు నిర్మలా సీతారామన్.

మరింత సమాచారం తెలుసుకోండి: