ఏపీలో జగన్ ని దించేయాల్సింద. ఇది టీడీపీ గట్టి పట్టుదల. ఈ విషయంలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా కూడా టీడీపీని చూసుకోవాల్సింది చరిత్రలోనే. ఈ సంగతి టీడీపీ వ్యూహకర్తలకు బాగా తెలుసు. మరో వైపు చూస్తే ఏపీలో వైసీపీ సోషల్ ఇంజనీరింగ్ చేసి బాగా పాతుకుపోతోంది.

ఎవరెన్ని అన్నా కూడా అప్పులు తెచ్చి అయినా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ వైసీపీ టార్గెటెడ్ సెక్షన్లను చాలా బాగా ఆకట్టుకుంటోంది. దాంతో 2024 ఎన్నికల వేళ వైసీపీకి ఎంత మేర లబ్ది కలుగుతుందో తెలియదు కానీ విపక్షాలు మాత్రం ఈ పరిణామాలు పెద్ద ఎత్తున కలవరపెడుతున్నాయి. ఇపుడు కనుక జగన్ని కట్టడి చేయకపోతే ఆయన మరోసారి గెలవడం ఖాయం.  ఆ మీదట ఆయన చెప్పినట్లుగానే ముప్పయ్యేళ్ల పాటు అధికారంలో కూడా ఉండే చాన్స్ ఉంది. అందుకే టీడీపీ సహా ఇతర విపక్షాలు జగన్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఏపీ రాజకీయాల్లో జగన్ని ఒంటరి చేసి మరీ ఓడించాలని టీడీపీ గట్టి వ్యూహాలనే రూపొందిస్తోంది. అదేలా అంటే ఒక వైపు బీజేపీని దువ్వుతూనే కాంగ్రెస్ కి కూడా కన్ను కొడుతోంది. ఇపుడు చూస్తే ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు జగన్నే వేలెత్తి చూపించి విమర్శిస్తున్నాయి.

ఇక 2009లో ఉమ్మడి ఏపీలో మహా కూటమిని కట్టిన చరిత్ర  టీడీపీకి ఉంది. నాడు వైఎస్సార్ ని రెండవమారు అధికారంలోకి రానీయకుండా చేయడానికి టీయారెస్, వామపక్షాలతో సహా అందరితోనూ టీడీపీ పొత్తు పెట్టుకుంది. సరిగ్గా ఇపుడు కూడా ఏపీలో మహా కూటమితో వైఎస్సార్ కుమారుడిని రెండవ మారు అధికారంలోకి రానీయకుండా చేయాలని చూస్తున్నారు అంటున్నారు. బీజేపీతో పొత్తు కుదిరితే జనసేన టీడీపీతో 2014 నాటి కూటమి రెడీ అవుతుంది. అలా కాదు అనుకుంటే బీజేపీని పక్కన పెట్టి కాంగ్రెస్, వామపక్షాలు, జనసేనలతో కలసి మహ  కూటమి కట్టాలని బాబు ఆలోచన చేస్తున్నారు అంటున్నారు. అదే కనుక నిజమైతే మాత్రం ఏపీలో వైసీపీకి రాజకీయంగా గట్టి పోటీ ఎదురైనట్లే అని భావించక తప్పదు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: