అందరు వదిలేసినా రష్యా, చైనా, పాక్ లు మాత్రం తాలిబన్ లను సంకెక్కించుకొని తిరుగుతున్నాయి. ఇప్పటి వరకు వాళ్ళను ప్రపంచ దేశాలలో ఎవరు గుర్తించడానికి ముందుకు రాకున్నప్పటికీ ఈ మూడు దేశాలు మాత్రం ఇంకా తాలిబన్ ల తో చర్చలు జరుపుతూనే ఉన్నారు. వారి తరుపున ప్రపంచం తో వకాల్తా పుచ్చుకుని మరీ సమావేశాలు జరుపుతున్నారు. తాజాగా ఆ బాధ్యత రష్యా తీసుకుంది. ఆ దేశం తాజాగా తాలిబన్ ల ను గుర్తించే విషయంపై ప్రపంచ దేశాలను ఆహ్వానించడం జరిగింది. ఎవరు స్పందించనప్పటికీ, తాలిబన్ లు మాత్రం కేవలం తమ తరుపున వకాల్తా పుచ్చుకున్నందుకు మాత్రం ఆ దేశానికి కృతఙ్ఞతలు తెలిపారు. రష్యా, చైనాలు కూడా ఒకదేశంతో స్నేహం చేసే అలవాటు లేనివే, కానీ ఇక్కడ ఇంత చొరవ తీసుకోవడానికి కారణం ఏమంటే, భవిష్యత్తులో ఆయుధాల వ్యాపారం రష్యా ఆలోచన అయితే, చైనాకు ఆఫ్ఘన్ లో ఉన్న వనరుల తోడుకోవడం అత్యవసరం, అది ఆ రెండు దేశాలు చూపిస్తున్న ప్రేమ.

ఆ మాత్రం తాలిబన్ లకు తెలియనిదేమి కాదనుకోండి, కానీ వాళ్ళు కూడా అదును కోసం చూస్తున్నారు అంతే, వాళ్లకు కూడా వారు వీరు అనేది ఉండదు అని ఇన్నేళ్ల పాక్ ఆశ్రయంలో ఉండి కూడా దానిని పోపొమ్మనలేదా, అలాగే తాలిబన్ లు కూడా ఎప్పుడో వాళ్లకు తగినట్టుగా ఝలక్ ఇచ్చి తీరుతారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళతో అవసరాలు ఉన్నాయి కాబట్టి స్నేహం అనే పదం అడ్డు పెట్టుకున్నారు అంతే. ఇక గతంలో కూడా తాలిబన్ లు రష్యా ను మూడు చెరువుల నీళ్లు తాగించిన విషయం ఎలాగూ తెలిసిందే. అప్పటి జ్ఞాపకాలు బహుశా రష్యా ను వణికిస్తూ ఉండవచ్చు కూడా. ఇవన్నీ ఎవరికి ఉపయోగం అనేది పక్కన పెడితే, తాలిబన్ లు మాత్రం ఊరికే కూర్చోలేదు అనేమీ మాత్రం నిజం.  

వాళ్ళు పాతకాలం చట్టాలు అమలు చేస్తుండొచ్చుగాక, కొత్త సాంకేతికతను చక్కగా వాడుకుంటూ, దానితో ప్రపంచాన్ని ఆడించడానికి అనేక సామజిక, వ్యక్తుల మధ్య ఉన్న బేదాభిప్రాయాలు అడ్డుపెట్టుకుంది, వాటినే తమ ఆయుధాలుగా చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఇదంతా సమాజం కావచ్చు, సామాన్యుడు కావచ్చు ఆలోచించే సరికే ప్రమాదాలు జరిగిపోతాయి. అది వాళ్ళ వ్యూహం. ఆ వ్యూహానికి ప్రపంచం అందకుండా జాగర్తపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, ఎక్కడో ఉన్న ఎలకను సొంత ఇళ్లు అని చెప్పి దానికి స్థానం కలిపిస్తే, ఇళ్ళంతా కొట్టేసిందని సామెత చందాన, దాక్కుంటే తప్ప బ్రతకలేని వెధవలకు ఒక బహిరంగ దేశాన్ని ఇస్తే ఇలాంటి పరిస్థితులే ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: