తెలంగాణ రాష్ట్ర స‌మితి 20 వ‌సంతాల సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని హైటెక్స్‌లో ప్లీన‌రి స‌మావేశాన్ని వేడుక‌గా నిర్వ‌హించారు. పార్టీ అధ్య‌క్షుడిగా ఎన్నిక‌యిన కేసీఆర్ మాట్లాడుతూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లోకి త్వ‌ర‌లో మ‌నం వెళ్ల‌బోతున్నామ‌ని.. అక్క‌డి నుంచి వేలాదిగా విజ్ఞ‌ప్తులు వ‌స్తున్నాయ‌ని చెప్ప‌డం సంచ‌ల‌నాత్మ‌కంగా మారాయి. అంతే ఒక్క‌సారిగా ఆ విష‌యంపై ఫోక‌స్ పెట్టింది. ఇదేంటి నిజ‌మా.. ప్లీన‌రీ వైపు అంద‌రి దృష్టి మ‌ర‌ల్చడానికి ఇలా అంటున్నాడా అన్న సందేహం నెల‌కొంది. మాట‌ల‌తో మ్యాజిక్ చేయ‌డంలో కేసీఆర్‌ను మించిన దిట్ట ఎవ‌రూ లేర‌నే చెప్పాలి.


  అందుకే మొద‌ట్లో ఏం అర్థం కాలేదు. ఈ క్ర‌మంలోనే ఆయ‌నే ఈ విష‌యంపై  స్ప‌ష్ట‌త‌నిచ్చారు. అదేంటంటే తెలంగాణ‌లో అమ‌లు చేసే ద‌ళిత‌బంధు ప‌థకానికి అధ్బుత‌మైన రెస్పాన్స్ వ‌స్తుంద‌ట‌.. ఆంధ్ర‌లోని ద‌ళితులు, నేత‌లు, ఇంకా ఇత‌ర రాజ‌కీయ పార్టీల నేత‌లు కూడా వ‌చ్చి ఆంధ్ర‌లో టీఆర్ఎస్ పెట్టాల‌ని విజ్ఞ‌ప్తులు వ‌స్తున్నాయ‌ట‌. దీంతో ఆ ప‌ది ల‌క్ష‌లు మావాళ్ల‌కు కూడా ఇవ్వాల‌ని కోరార‌ట‌. దాంతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ దానిది ఏముంద‌ని చెప్పి హామి ఇచ్చి స‌భా వేధిక‌పై నుంచి ఓకే చెప్పేశారు. అలాగే,  భార‌త‌దేశంలోని మిగ‌తా రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఫోన్ చేసి ద‌ళిత‌బంధు విష‌యంలో ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నార‌ని చెప్పుకొచ్చారు.


  అలాగే, దేశంలో ఇలాంటి మ‌హాద్భుత‌మైన ప‌థ‌కం ఇంకోటి లేద‌ని అన్నారు. అయితే, ఇత‌ర రాష్ట్రాల నుంచి ఒత్తిడి చేస్తున్నార‌ని, ఇత‌ర రాష్ట్రాల్లోకి కూడా మా నాయ‌కుడు ద‌ళిత‌బంధు ప‌థ‌కం ద్వారా వెళ్తాడ‌ని జాతీయ స్థాయి రాజ‌కీయాల్లోకి కూడా వేళ్తార‌ని ఆ పార్టీ నేత‌లు సంబర‌ప‌డిపోతున్నారు. ఏపీ రాజ‌కీయాల్లో కేసీఆర్ అడుగు పెడుతామ‌ని చెప్ప‌డం ఆయ‌న రాజ‌కీయ చ‌తుర‌త‌కు నిద‌ర్శ‌నం అని అంటున్నారు.

   కొంద‌రేమో అంద‌రిని దృష్టిని త‌న వైపు మ‌ళ్లించుకోవ‌డానికి చేస్తున్న ప్ర‌య‌త్నంలో భాగ‌మే ఇది అని అంటున్నారు. అయితే, ఆంధ్ర‌వాళ్లు దొంగ‌లు అని తిట్టిన నోటితోనే మీ అంత గొప్పొలు లేర‌ని ఎలా పొగుడుతార‌ని అప్పుడే ఆస‌క్తిగా ఉన్నారు. మ‌రి రాబోయే రోజుల్లో ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: