మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా, గంజాయి అక్రమ రవాణపై తెలుగుదేశం ఉద్యమం చేస్తుంది అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి అన్నారు. ఈ ఉద్యమంలో నేను కూడా క్రియాసీలకంగా పాల్గొన్నాను అని ఆయన పేర్కొన్నారు. నాకు కొన్ని అవరోదాలు సృష్టించారు అని విమర్శలు చేసారు. నాకు అండగా ఉన్న చంద్రబాబు, లోకేశ్‌, అచ్చం నాయుడు ఇతర నాయకులకు కృతజ్ఞతలు చెప్పారు ఆయన. మేము ప్రారంభించిన ఉద్యమం ఒక తరాన్ని కాపాడేందుకు అని ఆయన స్పష్టం చేసారు.

నేను మాట్లాడిన మాటలకు లేనిపోని అర్ధాలు సృష్టించారు అని అన్నారు ఆయన. నేను అడిగిన ప్రశ్నలకు సమాదానం చెప్పలేకపోయారు. అందుకే విధ్వంసానికి దిగారు అని విమర్శలు చేసారు. ఈ సమయంలో ఏడేళ్ళ నా కుమార్తె పసి హృదయం గాయపడింది అని ఆయన చెప్పుకొచ్చారు. నా బిడ్డ షాక్‌ కు గురైంది అని ఆయన తెలిపారు. బాధ్యత గల తండ్రిగా భార్యను, బిడ్డను తీసుకొని బయటకు వచ్చాను అని ఆయన వివరించారు. దీనికి కూడా విపరీతార్దాలు సృష్టిస్తున్నారు అని పట్టాభి మండిపడ్డారు.

అతి త్వరలోనే నేను జాతీయ అధికార ప్రతినిదిగా క్రియాశీలకంగా ఉంటాను అని ఆయన తెలిపారు. మాదకద్రవ్యాల వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంటా అని స్పష్టం చేసారు. నా పై పెట్టిన కేసులపై న్యాయస్ధానాలను ఆశ్రయిస్తా అని ఆయన వివరించారు. యన్‌టిఆర్‌ ఆశయం, చంద్రబాబు స్పూర్తితో ముందుకు నడుస్తా అని అన్నారు పట్టాభి. డ్రగ్స్ సప్లైకు వ్యతిరేకంగా మాట్లాడుతూన్నానని నాకు అవరోధాలు సృష్టిస్తున్నారు అని పట్టాభి ఆందోళన వ్యక్తం చేసారు. విపత్కర సమయంలో నాకు అండగా అందరూ  నిల్చున్నారు అని ఆయన  అన్నారు.

నేను మాట్లాడిన మాటలకి లేని అర్దాలను ఆపాదించారు అని విమర్శలు చేసారు. కుట్ర పూరితంగా నాపై కక్ష గట్టి మా ఇంటిపై  దాడి చేశారు అని అన్నారు. నా కుమార్తెపై దాడికి యత్నించి బయపెట్టారు అని పేర్కొన్నారు. మానవత్వం లేకుండా భయానక వాతావరణం సృష్టించారు అని వ్యాఖ్యలు చేసారు. నా కుమార్తెను కాపాడుకోవడం కోసం బయటకు వస్తే అధికార పార్టీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు అని విమర్శలు విపరీతర్థాలుతీస్తున్నారు అని వ్యాఖ్యానించారు. గాయపడిన పసి హృదయాన్ని కాపాడుకోవడం కోసమే దూరంగా వచ్చాను అని అన్నారు. బాధ్యత గల తండ్రిగా నా కుమార్తె భయాన్ని పోగొట్టడం నాకు ముఖ్యం అని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: