ఏపీ మంత్రి కొడాలి నాని మాట తీరుపై ముందు నుంచే తీవ్ర విమ‌ర్శ‌లు ఉన్నాయి. నాని నోటి కి ఎంత వ‌స్తే అంత మాట్టాడేస్తున్నారు. ఎన్నో ఆయ‌న మాట తీరుపై రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాకుండా.. సామాన్య ప్ర‌జ‌ల నుంచి కూడా తీవ్రమైన విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయినా నాని మాత్రం వెన‌క్కు త‌గ్గ‌లేదు. ఇక ఇటీవ‌ల ఏపీ రాజ‌కీయాల‌ను చూస్తుంటే ఎంత బ్ర‌ష్టు ప‌ట్టి పోయాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేకుండా పోయాయి. నాని బూతుల మంత్రి గా పేరు తెచ్చుకున్నారు. జ‌గ‌న్ కేబినెట్లో మంత్రి అయిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న ప‌దే ప‌దే చంద్ర‌బాబు, టీడీపీని కావాల‌నే టార్గెట్ చేస్తున్న‌ట్టుగా ఉంది.

నాని దూకుడు కు తోడు టీడీపీ నుంచి గెలిచి పార్టీ మారిన గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వంశీ సైతి తోడు అయ్యారు. చివ‌ర‌కు చంద్ర‌బాబు ఫ్యామిలీని కించ‌ప‌రిచేలా ప‌రోక్ష మైన అర్థాలు వ‌చ్చేలా వీరు మాట్లాడుతూ వ‌స్తున్నారు. వీరి మాట‌ల‌ను తీసుకుని వైసీపీ వాళ్లు కూడా రెచ్చి పోతున్నారు. అయితే కొడాలి నాని మాట్లాడుతోన్న మాట‌లు జూనియ‌ర్ ఎన్టీఆర్ కు డ్యామేజ్ చేస్తున్నాయ‌న్న చ‌ర్చ‌లు కూడా ఇప్పుడు టీడీపీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. నాని ఎన్టీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడు అన్న విష‌యం తెలిసిందే.

తాజాగా నాని నాకు రాజ‌కీయ భిక్ష పెట్టింది చంద్ర‌బాబు అయితే.. ఆడే పెద్ద బిచ్చ‌గాడు రాష్ట్రంలో అని వి మ‌ర్శించారు. చంద్ర‌బాబు కు రాజ‌కీయ భిక్ష పెట్టింది ఇందిరాగాంధీ .. ఎన్టీఆర్ అని వాడు నాకు బిక్ష పెట్ట‌డం ఏంట‌ని కొడాలి నాని తీవ్రంగా ఫైర్ అయ్యారు. నాకు రాజ‌కీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ , వాళ్ల పెద్ద‌బ్బాయ్ హ‌రికృష్ణ , వాళ్ల మ‌న‌వ‌డు జూనియ‌ర్ ఎన్టీఆర్ మాత్ర‌మే అని.. అడుక్కు తినే చంద్ర‌బాబు  నాకు భిక్ష పెట్ట‌డం ఏంట‌ని ఫైర్ అయ్యాడు.

తాను ఎన్టీఆర్ ను చూసి పార్టీలోకి వెళ్లా అని.. తాను చంద్ర‌బాబును ఆయ‌న బాబు క‌ర్జూర నాయుడు, వాళ్ల తాత ల‌వంగ నాయుడ్ని చూసి పార్టీలోకి వెళ్ల‌లేద‌ని కొడాలి నాని చెప్పారు. అంతిమంగా ఈ ప్ర‌స్తావ‌న‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్ పేరు తీసుకు రావ‌డంతో జూనియ‌ర్ ఇరుకున ప‌డుతోన్న ప‌రిస్థితి ఉంది. ఎన్టీఆర్ త‌న‌కు టిక్కెట్ ఇప్పించార‌ని నాని చెపుతోన్న మాట‌లు అంతిమంగా ఎన్టీఆర్ కే మైన‌స్ అయ్యేలా ఉన్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: