కేవలం ఫ్రంట్ లైన్ వర్కర్లకే కాదు.. 60 ఏళ్లు పైబడిన వారికి కూడా వైద్యుల సలహా మేరకు బూస్టర్ డోసు అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. రానున్న రోజుల్లో వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేస్తామని ప్రధాని మోడీ అన్నారు. దేశంలో కరోనా ఇంకా పూర్తిగా నిర్మూలన కాలేదన్న ప్రధాని.. దేశంలోని 90 శాతం వయోజనులకు తొలి డోసు పూర్తయిందని గుర్తు చేశారు.
ఇప్పటికే ఒమిక్రాన్‌పై రకరకాల వార్తలు, వదంతులు వస్తున్నాయని.. వాటిని నమ్మ వద్దని ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు. జనవరి 3 నుంచి 15-18 ఏళ్లు ఉన్న వారికి కొవిడ్ టీకా పంపిణీ చేస్తామని ప్రధాని మోదీ తెలిపారు. అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇదన్న ప్రధాని.. అనవసరంగా ఎవరూ భయపడవద్దని సూచించారు. ఒమిక్రాన్ వస్తోందని ఎవరూ భయాందోళనకు గురికావొద్దని.. ఇవాళ దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో 18 లక్షల పడకలు ఉన్నాయని ప్రధాని మోడీ గుర్తు చేశారు.
అంతే కాదు.. చిన్నారుల కోసం 90 వేల పడకలు సిద్ధంగా ఉన్నాయిని.. ఇవాళ దేశంలో ఔషధాలకు ఎలాంటి కొరత లేదని ప్రధాని మోడీ భరోసా ఇచ్చారు. ఒమిక్రాన్ నివారణకు టీకాలు, జాగ్రత్తలే మందు అని గుర్తు చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. అనేక రాష్ట్రాల్లో వంద శాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యిందన్నారు. వ్యాక్సిన్ తయారీ, పంపిణీ కోసం నిరంతరం పని చేస్తున్నామని.. ఆరోగ్య కార్యకర్తల అంకితభావం వల్లే టీకా పంపిణీ వేగంగా సాగుతోందని ప్రధాని అన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి