గత వారం రోజుల కిందట దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో రెండు ప్రధానమైన విషయాలు ప్రజలకు మరో సారి అర్థమయ్యాయి. అందులో ఒక విషయం ఏమిటంటే, బీజేపీ ప్రభుత్వం వచ్చిన 7 సంవత్సరాల్లో తీసుకున్న నిర్ణయాలు ప్రజలను ఇబ్బందులు పెట్టాయన్న ప్రచారం మరియు అపవాదు ఉంది. ఈ ఎన్నికలో దానిని ఈ 5 రాష్ట్రాల ప్రజలు బీజేపీ కి వ్యతిరేకంగా తమ ఓటు వేసి నిరూపిస్తారు అని విపక్షాలు కలలు కన్నాయి. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ బీజేపీ నాలుగు రాష్ట్రాలలో విజయ కేతనం ఎగురవేసింది. దీనితో బీజేపీకి కేంద్రంలో తిరుగులేదని మరోసారి రుజువైంది.

ఇక మరో విషయం కేంద్రంలో ఈ ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ పుంజుకుంటుంది అన్న నమ్మకం కాంగ్రెస్ అనుకూల పార్టీలలో మరియు బీజేపీ వ్యతిరేక ఓటర్ లలో ఉండేది. కానీ కాంగ్రెస్ కు ఎంత విలువైన స్థానం కల్పించారు అన్నది ఫలితాలను బట్టి తెలిసింది. మిగిలిన రాష్ట్రాలలో అధికారం పరిస్థితి పక్కన పెడితే అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రాన్ని సైతం కోల్పోవడం మరీ దారుణం. అయితే ఇలా కాంగ్రెస్ విఫలం కావడానికి ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ ముందు ముందు దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ అంత ప్రభావవంతంగా ఉండబోదని ఈ ఫలితాలు చెబుతున్నాయి.

రెండు పర్యాయాలుగా బీజేపీ సౌత్ లో పాగా వెయ్యాలని ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఒక్క కర్ణాటక తప్పించి మిగిలిన రాష్ట్రాలలో తన పప్పులు ఉడకడం లేదు. అందుకే ఈ సారి ఎన్నికల్లో సౌత్ లో బలమైన తెలుగు రాష్ట్రాలలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రత్యేక వ్యూహాను సిద్దం చేసుకుంటోంది. అందుకోసం ఇప్పటికే కేంద్రం నుండి ముఖ్య నాయకులు తెలుగు రాష్ట్రాలకు వచ్చి దానిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరి ఏపీలో జగన్? తెలంగాణ లో కేసీఆర్ ఈ వ్యూహాలను తిప్పికొడతారా  లేదా బీజేపీ అస్త్రాలను బలవుతారా అన్నది తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: