ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన పార్టీకి నాలుగు అసెంబ్లీ టికెట్లు లభించగా.. ఇందులో ముగ్గురికి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం గమనార్హం.. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారుగా ఎ
యలమంచి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కు టికెట్ ఇవ్వకుండా.. విశాఖ సౌత్ నియోజకవర్గం సీటుని వైసీపీ పార్టీ నుంచి వచ్చిన వంశీకి ఇవ్వడం జరిగింది.. అలాగే పెందుర్తి అసెంబ్లీ సీటు కూడా వైసీపీ నుంచి వచ్చిన రమేష్ కు ఇచ్చారు.. కేవలం జనసేన పార్టీలో అన్ని పార్టీల నుంచి వచ్చిన మాజీ మంత్రులకే టికెట్లు కేటాయించడం జరిగింది.


విశాఖ జిల్లాలో ఇచ్చిన నాలుగు సీట్లలో కేవలం ఒక రామకృష్ణ తప్ప.. మిగిలిన ముగ్గురు జనసేన అభ్యర్థులు ఖర్చులు పెట్టడానికి వెనకడుగు వేస్తున్నారని.. సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయి. తమ ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ ఈ విషయంలో చాలా ముందుకు వెళుతూ ఉంటే.. జనసేన అభ్యర్థులు ముగ్గురు మాత్రం నెమ్మదిగా ముందుకు సాగుతున్నారు.. ఇలాగైతే ఎలా అంటూ పార్టీ నేతలే అంటున్నారట. ఎన్నికలంటే డబ్బుతో కూడిన పని అని.. కచ్చితంగా ఖర్చు చేయాల్సిందే అని తెగేసి కార్యకర్తలు, నేతలు చెబుతున్నారు.


ఇటీవల పవన్ కళ్యాణ్ అనకాపల్లి రోడ్డు షో కూడా నిర్వహించారు. అందుకు అయ్యే ఖర్చు అనకాపల్లి ఎంపీ అభ్యర్థితో పాటు ఎమ్మెల్యే కూడా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ఊపులోనే విశాఖ సౌత్ యలమంచి రోడ్డు షో లో కూడా పలు షోలు నిర్వహించాల్సి ఉన్నది.. ముఖ్యంగా రోజువారి కార్యకర్తల ఖర్చులే చాలా ఎక్కువ అవుతున్నాయని.. తమ అధినేత రోడ్ షోలకు ఎప్పుడు పిలుస్తారో అనే ప్రశ్నలు వినిపిస్తున్న తరుణంలో.. ఇటీవల ఉగాది,  రంజాన్ పండుగలు కేవలం రెండు రోజుల వ్యవధిలోనే రావడంతో అటు వైసిపి నాయకులు ఉగాది పండుగను,  ఇఫ్తార్ విందులను చాలా ఘనంగా చేశారు. అలా డోర్ టు డోర్ కాంపెయిన్ ను కూడా నిర్వహిస్తున్నారు. ఇలాంటి జీరో  బడ్జెట్ తో రాజకీయాలు చేయాలనుకుంటున్నారా అని అనుమానాలు కూడా సొంత పార్టీలో మొదలవుతున్నాయి. ఇలా అయితే ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవడం చాలా కష్టమని చెప్పవచ్చు. మొత్తానికి అయితే జీరో బడ్జెట్ తో చేసే ప్రచారాలు ఈ ముగ్గురు అభ్యర్థులకు ఓటమి మిగిల్చేలా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: