మరికొంత కాలంలోనే దేశంలో లోక్ సభ ఎన్నికలు జరగబోతున్న విషయం మనకు తెలిసిందే. దానితో నేషనల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ సీట్ల పంపిణీ విషయంలో చాలా చురుగ్గా నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని జాబితాలను కూడా విడుదల చేసింది. ఇకపోతే తాజాగా కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన మరో జాబితాను విడుదల చేసింది. ఇందులో రెండు రాష్ట్రాలకు సంబంధించిన క్యాండేట్ ల పేర్లను విడుదల చేసింది. ఇక తాజాగా కాంగ్రెస్ విడుదల చేసిన లిస్ట్ లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన తొమ్మిది మంది ... జార్ఖండ్ కు సంబంధించిన ఇద్దరు పేర్లను విడుదల చేసింది.

తాజా లిస్ట్ లో ఆంధ్రప్రదేశ్‌ లోని శ్రీకాకుళం నుంచి పెడాడ పరమేశ్వరరావు సీట్ ను దక్కించుకోగా ... విజయనగరం నుంచి బొబ్బిలి శ్రీను , అమలాపురం నుంచి జంగా గౌతమ్ , మచిలీపట్నం నుంచి గొలు కృష్ణ , విజయవాడ నుంచి వల్లూరు భార్గవ , ఒంగోలు నుంచి ఈదా సుధాకర్‌రెడ్డి , నంద్యాల నుంచి జంగీటి లక్ష్మీ నరసింహ యాదవ్‌ , అనంతపురం నుంచి మల్లికార్జున్‌ కు , హిందూపురం నుంచి సమద్‌ షాహీన్‌ కు టికెట్‌ ఇచ్చారు. ఇక జార్ఖండ్‌లోని గొడ్డా నుంచి దీపికా సింగ్ పాండే స్థానంలో ప్రదీప్ యాదవ్‌ ను రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాండిడేట్ ప్రకటించింది.

ఇక రాంచీ అభ్యర్థిగా యశస్విని సహాయ్‌ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. ఇలా తాజాగా కాంగ్రెస్ విడుదల చేసిన లోక్ సభ క్యాండేట్ల లిస్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 9 మంది సీట్లు దక్కించుకున్నారు. ఇక వీరంతా కూడా చాలా చురుగ్గా ప్రచారాలలో పాల్గొనే అవకాశం ఉంది. మరి పోయిన గత రెండు లోక్ సభ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ సీట్ లను దక్కించుకోలేదు. మరి ఈ సారి అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి స్థానాలను కాంగ్రెస్ పార్టీ దర్శించుకుంటుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: