తెలంగాణ సర్కారు శ్రీశైలం ఎడమ కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగ పనులను పునరుద్ధరించేందుకు కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మిగిలిన 9 కిలోమీటర్ల సొరంగ నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేసే లక్ష్యాన్ని ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు రక్షణ శాఖ సహకారం కోరామని, ఆర్మీ, వైమానిక దళం నుంచి సాంకేతిక సాయం అందుతుందని తెలిపారు. ఈ సొరంగం శ్రీశైలం నుంచి నల్గొండ జిల్లాకు 3-4 లక్షల ఎకరాలకు నీటిని సరఫరా చేసేందుకు రూపొందించబడింది. 20 ఏళ్ల క్రితం రూ. 4,500 కోట్ల అంచనాతో మొదలైన ఈ 44 కిలోమీటర్ల సొరంగం, ప్రపంచంలోనే అత్యంత పొడవైన నీటిపారుదల సొరంగంగా గుర్తింపు పొందింది.

ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్రం నుంచి ఆర్మీ నిపుణులైన కల్నల్ పరీక్షిత్ మెహరా, సరిహద్దు రోడ్ల సంస్థ మాజీ డీజీ జనరల్ హర్పాల్ సింగ్‌లను డిప్యూటేషన్‌పై పంపేందుకు అంగీకారం లభించింది. రోహతాంగ్, సీలా సొరంగాల నిర్మాణంలో నైపుణ్యం కలిగిన ఈ అధికారులు, తెలంగాణలో సొరంగ నిర్మాణాలకు సాంకేతిక సలహాలు అందిస్తారు.


పరీక్షిత్ మెహరాను ప్రత్యేక కార్యదర్శిగా, హర్పాల్ సింగ్‌ను గౌరవ సలహాదారుగా నియమించనున్నారు. అమరాబాద్ పులుల సంరక్షణ కేంద్రంలో ఉన్నందున, హెలికాప్టర్ సర్వేల ద్వారా భౌగోళిక స్థితిని అంచనా వేసేందుకు వైమానిక దళం, పవన్ హన్స్ హెలికాప్టర్ల సాయం కోరారు. ఈ చర్యలు ప్రాజెక్టు వేగవంతానికి దోహదపడతాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

వాట్సాప్ నెంబ‌ర్‌ 94905 20108 కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: