ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి పాత్ర మరవలేనిది. ప్రతి కొడుకు కూతురు సక్సెస్ వెనుక తండ్రి పాత్ర ఎంతో ఉంటుంది. ఎలాంటి కష్టం వచ్చినా తమ సపోర్ట్ ఉంటుందని తండ్రులు ఎప్పుడూ పిల్లలకు చెబుతూ ఉంటారు. పిల్లలు తప్పు చేసినా ఆ తప్పులను సరిదిద్దే విషయంలో తల్లిదండ్రులు ముందువరసలో ఉంటారు. తండ్రి లేని పిల్లలు నిజ జీవితంలో ఎదుర్కొనే కష్టాలు మాత్రం అన్నీఇన్నీ కావు.

తండ్రి ఆర్థికంగా అండగా నిలబడటంతో పాటు తప్పు చేస్తే సరైన దారిలో  పెట్టే  విషయంలో ముందువరసలో ఉంటారు.  నాన్న అంటే భయపడే  పిల్లలు కొందరు ఉన్నా తండ్రి మనసులో పిల్లలకు మాత్రం ప్రత్యేకమైన స్థానం ఉంటుందని చెప్పవచ్చు. ఎలాంటి పరిస్థితిలో అయినా కుటుంబానికి అండగా నిలబడే విషయంలో తండ్రి పాత్ర అంతాఇంతా కాదు.  ఇంటి బాధ్యతలను సైతం పంచుకుంటున్న తండ్రుల సంఖ్య తక్కువేం కాదు.

పిల్లల కష్టాలను తమ కష్టాలుగా  భావించే తల్లిదండ్రులు ఉన్న ప్రతి కొడుకు కూతురు అదృష్టవంతులే అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.  పిల్లలని  చూసుకోవడానికి మగవాళ్ళు ఇంటి పట్టునే ఉంటున్న సందర్భాలు సైతం ఎక్కువగానే ఉన్నాయి.  గతంతో పోల్చి చూస్తే  తండ్రి పాత్రకు ప్రాధాన్యతతో పాటు  బాధ్యత సైతం  పెరిగింది.  పిల్లలు కోరిన ప్రతి కోరికను నెరవేర్చడానికి తండ్రులు  తమ వంతు  ప్రయత్నిస్తున్నారు.

తండ్రి సపోర్ట్ ఉంటే  ఆ కుటుంబం ఎలాంటి కష్టాలు రాకుండా  సంతోషంగా ఉంటుందని చెప్పవచ్చు.  వంటలు  చేయడానికి  సైతం  తండ్రులు  సిద్ధంగా ఉన్నారు.  కొన్ని కుటుంబాలలో  ఆడవాళ్ళ కంటే మగవాళ్లే అద్భుతంగా వంట చేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.  పని ఒత్తిడి తట్టుకుంటూనే తండ్రులు తమ కుటుంబం సంతోషంగా ఉండటానికి  ఎన్నో త్యాగాలు చేయడానికి సిద్దపడుతున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: