
సీనియర్ జర్నలిస్టు అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆయనను బెయిల్ పై విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా జస్టిస్ మన్మోహన్ ల ధర్మాసనం తెలిపిన వివారాల ప్రకారం చూస్తే.. వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వ్యాఖ్యానించింది. డిబేట్ లో కొమ్మినేని శ్రీనివాస రావు నవ్వినంత మాత్రాన అరెస్టు చేస్తారా అంటూ మొట్టికాయలు వేసింది. కోర్టు విచారణ సమయంలో మేము కూడా నవ్వుతామని, దాన్ని బట్టి అరెస్టులు చేయడం సరికాదని తెలియజేసింది. ఆయనను తెలంగాణ లో అరెస్టు చేసి 331 కిలోమీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్లో రిమాండ్ చేయడం ఏంటని ప్రశ్నించింది.