
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక భారత మాజీ క్రికెటర్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కు కొత్త ఆశలు రేపుతుంది. అక్కడ నుంచి గత ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. అయితే చివరి క్షణంలో కాంగ్రెస్ టికెట్ ఖరారు చేయడంతో ఓడిపోయారు. 16 వేల ఓట్ల తేడాతో ఆయన ఓటమి పాలయ్యారు. చివరి క్షణం లో టిక్కెట్ ఖరారు చేయడంతో తను ఓడిపోయానని ... చాలాకాలంగా అక్కడే పని చేస్తున్నందున ఈసారి గెలిచి తీరుతానని అంటున్నారు. అజారుద్దీన్ కు టికెట్ ఇవ్వరన్న ప్రచారం పెరగడంతో మీడియా సమావేశాలు పెట్టి తానే పోటీ చేస్తానని తనకు రేవంత్ - రాహుల్ - వేణుగోపాల్ - మీనాక్షి నటరాజన్ సపోర్ట్ ఉందని ఆయన చెప్తున్నారు. అయితే ఈసారి జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికి ఇవ్వాలన్నా మజ్లిస్ సూచన మేరకు జరిగే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ లో మజ్లిస్ ఎవరికి సపోర్ట్ చేస్తే వారికి ప్లస్ అవుతుంది.
గత ఎన్నికలలో బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసింది కానీ మజ్లిస్ టికెట్ విషయంలో కాంగ్రెస్ ఎలాంటి సంకేతాలు పంపుతారన్నది సస్పెన్స్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ కొటాలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. కాంగ్రెస్ మైనార్టీ ఎమ్మెల్యేలు లేరు. గ్రేటర్ పరిధిలోను ఓ మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. ఎక్కడ కూడా ఆ పార్టీకి ఎమ్మెల్యేలు లేరు. అందుకే రెండు కోణాల్లోనూ జూబ్లీహిల్స్ నుంచి గెలిచే కాంగ్రెస్ అభ్యర్థికి మంత్రి పదవి ఖాయం అనుకోవచ్చు. అందుకే చాలామంది మైనార్టీ నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. ఉప ఎన్నికలలో అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి జూబ్లీహిల్స్ లోనూ గెలుస్తామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు