ఈ మధ్య కాలంలో పత్రికలలో, టీవీ ఛానళ్లలో కంటే సోషల్ మీడియా పోస్టుల ద్వారానే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయనే సంగతి తెలిసిందే. ఈనాడు, ఆంధ్రజ్యోతి సైతం అమరావతిలో వరదల వాస్తవ పరిస్థితి గురించి ప్రస్తావిస్తూ ఫోటోలను ప్రచురించడం జరిగింది. మంత్రి నారాయణ మాట్లాడుతూ మట్టి తేడా రావడం వల్ల నీళ్లు వచ్చి చేరాయని స్వయంగా మంత్రి నారాయణ వెల్లడించడం జరిగింది. అక్కడ నీళ్లు ఉండటం మాత్రమే నిజమేనని మంత్రి కామెంట్లతో క్లారిటీ వచ్చింది.

అయితే వాణిజ్య పన్నుల శాఖా అధికారి అయిన సుభాష్ అనే వ్యక్తి అమరావతి  వాస్తవ  పరిస్థితుల గురించి ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.  అయితే ఆయన పోస్టుల గురించి  మీడియాలో సోషల్ సైకోలు అంటూ కథనాలు వెలువడ్డాయి.  అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్న పత్రికలు, జర్నలిస్టులు  సోషల్ మీడియా పనితీరు గురించి నీతులు చెప్పడం కొసమెరుపు.

అయితే ఈ సుభాష్ గతంలో కూడా పలు వివాదాస్పద పోస్టులు సోషల్ మీడియాలో పెట్టాడనే ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ వ్యక్తి హిందుత్వాన్ని సైతం వ్యతిరేకిస్తాడని తెలుస్తోంది.   అమరావతి పోస్టుల విషయంలో సుభాష్ కు నోటీసులు జారీ కాగా  నా ఫేస్  బుక్  పోస్ట్ వ్యక్తిగత  అభిప్రాయం అని ప్రభుత్వం గురించి తానేం ప్రస్తావించలేదని చెప్పుకొచ్చారు.  గతంలో తాను  హైదరాబాద్, చెన్నై గురించి  కూడా  ప్రస్తావించానని ఈ సందర్భంగా తెలిపారు.

అయితే సుభాష్ ప్రభుత్వ ఉద్యోగి అయిన నేపథ్యంలో సస్పెండ్ చేస్తారా మరో విధంగా  చర్యలు తీసుకుంటారా అనే ప్రశ్నలకు మాత్రం జవాబులు దొరకాల్సి ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: