ఏపీకి సంబంధించినంతవరకు వైసీపీ చేతిలోకి అధికారం రావడం గొప్ప మార్పు. అయితే పాలనాపరంగా మార్పు రావడం అన్నది ముఖ్యం. జగన్ అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాలేదు. దూకుడు, వేగం ఎవరూ అందుకోలేనంతంగా ఉంది. దాంతో ట్రెడిషనల్ పొలిటీషియన్లు చాలా ఇబ్బంది పడుతున్నారు.



ఓ విధంగా చెప్పాలంటే రియల్ హీరో రీల్ హీరోగా మారాడా అనిపిస్తోంది జగన్ గురించి అక్కసులో టీడీపీ నాయకులు అన్న మాటలు చూస్తే భరత్ అను నేను మూవీని మక్కీకి మక్కీ జగన్ ఫాలో అవుతున్నారట. అందులో చేసినట్లుగానే ఇక్కడ కూడా చేస్తున్నారుట. మరి జగన్ కి ఆ మూవీ ఇన్స్పిరేషన్ అయితే మంచిదే కదా.


అలాగే ఒకే ఒక్కడు, లీడర్ మూవీస్ కూడా కళ్ళ ముందు కదలాడుతున్నాయట. మరి ముఖ్యమంత్రి సీట్లో ఓ దమ్మున్న నాయకుడు కూచోవాలే కానీ ఇలాంటి నిర్ణయాలు గట్టిగా తీసుకోవడం కష్టం కాదేమో. జగన్ డేరింగ్ అండ్ దేషింగ్. అందుకే ఆయన చేసి చూపిస్తున్నారనుకోవాలి. రీల్ హీరోలు రాజకీయాల్లోకి వచ్చి రియల్ హీరోలు కాలేకపోయారు. కానీ రియల్ హీరో మాత్రం రీల్ హీరో అయ్యాడు. 


అనుకున్నది చేసేస్తూ విలన్ల భరతం పట్టేస్తునాడు. విషయం ఏంటి అంటే సినిమా ఇంకా ఇపుడే మొదలైంది. ముందు ముందు ఎన్నో ట్విస్టులు ఉంటాయి. తొలి అయిదు నిముషాలకే షాకులు తింటే మొత్తం  మూడు గంటల సినిమా అయ్యేసరికి ఎక్కడ ఉంటారో అని వైసీపీ నేతలు టీడీపీ తమ్ముళ్ల మీద సెటైర్లు వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: