పోలవరం వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. ప్రస్తుతం పనులు చేబడుతున్న నవయుగ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం టెర్మినేషన్ లెటర్ ఎప్పుడో ఇచ్చింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా రీటెండరింగ్ పనులు కూడా స్టార్ట్ చేసింది. ఇప్పటీకే రీటెండరింగ్ పనులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వటం ఇప్పుడు ఆసక్తిగా కరంగా మారింది. అయితే ఇప్పటికే పోలవరం పనులు లేట్ అయినాయని .. మళ్ళీ ఇంకాజ్ జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పిన సంగతీ తెలిసిందే. అయితే ఇప్పుడు నవయుగ కంపెనీ .. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తే కోర్ట్ మెట్టులు ఎక్కింది. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యల పట్ల పోలవరం అధారిటీ ( కేంద్ర జల వనరుల శాఖ ) తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుంది.


ఇప్పుడు మళ్ళీ టెండరింగ్ కు వెళ్లాల్సిన పని లేదని ఇది సమయం వృధా పని అని తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. కానీ జగన్ మాత్రం ఎట్టి పరిస్థితిలో రీటెండరింగ్ కు వెళ్ళాలిసిందేనని చెబుతున్నారు. ఇప్పటికే రీటెండరింగ్ కు సంభందించి జగన్ ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. పోలవరంలో పెద్ద అవినీతి జరిగిందని ప్రతి పక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్ పలు సార్లు చెప్పుకొచ్చారు. అయితే జగన్ ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి పోలవరంలో జరిగిన అవకతవకలు మీద ప్రత్యేక దృష్టి పెట్టారు.


పోలవరంలో జరిగిన అవినీతి పై ఒక కమిటీని కూడా జగన్ నియమించారు. ఇప్పుడు ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా పోలవరం పనులు నిలిపేయాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. యితే పోలవరం పనులు ఎట్టి పరిస్థితిలో లేటు కాకూడదని జగన్ ప్రభుత్వం వెంటనే టెండరింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ప్రభుత్వం కోట్ చేసిన ధర కంటే తక్కువలో ఏ కంపెనీ అయినా ముందుకు వస్తే ఆ కంపెనీకి ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే ఇప్పుడు అనూహ్యంగా నవయుగ కంపెనీ కోర్ట్ కు వెళ్లడం అనేది ప్రాజెక్ట్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: