విశ్వసనీయ సమాచారం ప్రకారం కొత్త రాజధానిని తుళ్ళూరు ప్రాంతంలో నిర్మించాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డిసైడ్ అయినట్లు సమాచారం. అంటే అమరావతి ప్రాంతంలో ఇపుడు నిర్మాణంలో ఉన్న వాటిని కొనసాగించి మిగిలిన వాటిని ఆపేస్తారు. ప్రభుత్వంలోని ఉన్నతస్ధాయి వర్గాలిచ్చిన సమాచారం ప్రకారం ప్రస్తుతం నిర్మించిన తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ లాంటివి ఇలానే ఉండిపోతాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదని జగన్ నిర్ణయించారట.

అదే సమయంలో తుళ్ళూరు మండలంలోని శివారు ప్రాంతంలో శాస్వత అసెంబ్లీ, శాస్వత సచివాలయం, హై కోర్టు, రాజ్ భవన్ లాంటి నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదకన నిర్మించాలని జగన్ నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించటం వెనుక కొన్ని కారణాలున్నాయి. ఎక్కడైనా అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్, హై కోర్టు ఉన్న ప్రాంతాన్నే రాజధాని అంటారు. వాటిని తుళ్ళూరు ప్రాంతంలో నిర్మించాలని జగన్ డిసైడ్ అయ్యారట.


అందులో కీలకమైనవి ఇక్కడ భారీ నిర్మాణాలకు భూమి అనువైనది కాదు. మిగిలిన ప్రాంతంలో నిర్మాణాలకు 100 రూపాయలు ఖర్చయితే లింగంపల్లి, నీరుకొండ ప్రాంతాల్లో భారీ నిర్మాణాలకు 400 రూపాయలు ఖర్చవుతుంది. పైగా ఇక్కడ భూమి భూకంపాలు వచ్చే డేంజర్ జోన్లో ఉంది. సమీపంలోనే ఉన్న కొండవీటి వాగు పొంగితే చుట్టుపక్కల గ్రామాలు ముణిగిపోవటం ఖాయం. మొన్నటి వరదలకే చుట్టు పక్కల ప్రాంతాలు చాలా వరకూ జలమయమయ్యాయి.

 

అందుకనే అన్నీ విషయాలను దృష్టిలో పెట్టుకునే తుళ్ళూరు మండలంలోని శివారు ప్రాంతంలో శాస్వత నిర్మాణాలు చేయాలని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఇక్కడ ప్రభుత్వ భూమే సుమారు 3 వేల ఎకరాలుందట. పైగా ఇక్కడ భూమి మొత్తం పూర్తిగా రాకీ సాయిల్. కాబట్టి భారీ  నిర్మాణాలకు ఎటువంటి సమస్యలు రావు. కొండవీటి వాగుతో కూడా సమస్య ఉండదు. ఇపుడు నిర్మాణంలో ఉన్న వాటిని మాత్రం పూర్తిచేస్తారంతే. ఇక ఎటువంటి నిర్మాణాలు చేయరు.  జగన్ ఆలోచన అనుకున్నది అనుకున్నట్లు సాగితే మరో మూడేళ్ళల్లోనే ఏపికి కొత్త రాజధాని నిర్మాణం పూర్తయిపోవటం ఖాయం.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: