రోజు రోజుకు ఆడపిల్లలపై అత్యాచారాల పరంపర కొనసాగుతూనే వుంది. అంతకంతకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం విస్తరించిన మనిషిని మనిషిగా గుర్తించలేని గుడ్ది తనంతో ఈ సమాజం బ్రతుకుతుంది. ఈ నేపథ్యాన స్త్రీ దేహాన్ని విలాసవస్తువుగా చూపే ధోరణి మరింతగా పెచ్చరిల్లింది. ఆమె దేహంలోని సమస్త భాగాలతో లాభాలు దండుకునే క్రూరమైన వ్యాపారక్రీడ రోజు రోజుకు విస్తరిస్తుంది..


ఇక కంటిముందు చాటుగా కనిపించే వేల అశ్లీల వెబ్‌సైట్స్‌ మనుషుల్లోని సున్నిత భావాల్ని చిదిమేస్తున్నాయి. దాని మూలంగా స్త్రీలను కేవలం శృంగారోపకరణాలుగా చిత్రించే వైనం అనేక దారుణాలకు మూలంగా మారుతుంది.. అభివృద్ధి పేరిట అనుసరించే అపసవ్య విధానాల బీభత్సానికి బలవుతున్నది ప్రధానంగా మహిళలేనని జరుగుతున్న సంఘటనలు రుజువు చేస్తున్నాయి.ఇక మరో మగమృగం తన కామదాహానికి పదహారు సంవత్సరాల అమ్మాయిని బలిచేసింది పూర్తి వివరాల్లోకి వెళ్లితే.


తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన 16ఏళ్ల బాలిక, వాళ్ల అమ్మమ్మ ఇంట్లో ఉంటూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలో రోజూ అమలాపురంలోని కాలేజీకి వెళ్లి వస్తున్న సమయంలో ఈ బాలిక పై కన్నేసిన  అల్లవరం మండలం గోడి గ్రామానికి చెందిన తాడి రమేష్(21) అనే యువకుడు ఒక్కసారైన తనతో సుఖాన్ని పొందాలని మనసులో కోరికను పెంచుకుని,అందుకోసం కొద్దిరోజుల పాటు ఆమె కాలేజీ వద్ద రెక్కీ నిర్వహిస్తూ ఆమెతో మాటలు కలిపాడు.


ఆమెకు తనపై కొంచెం నమ్మకం కలగడంతో ఓ రోజు సాయంత్రం కాలేజీ నుంచి బయటకు వచ్చిన బాలికను మాటల్లో దించి తనతో పాటు బైక్‌పై నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అయినా ఆమెపై మోజుతీరక ఆ బాలికను బెదిరిస్తూ వరుసగా 23రోజుల పాటు అమెను ఓ ప్రదేశంలో నిర్బంధించి బలవంతంగా రోజూ అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. ఇక కాలేజీకి వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఆరా తీశారు.


అయినా ఆమె ఆచూకీ ఎక్కడా లభ్యం కాకపోవడంతో సెప్టెంబర్ 5న పి.గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక కోసం తీవ్రంగా గాలించే సమయంలో,కొందరిని విచారించగా ఆమె కిడ్నాప్‌కు గురైనట్లు తెలుసుకుని సెప్టెంబర్ 21న వెతికి పట్టుకున్నారు. ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన రమేష్‌ను ఆదివారం(అక్టోబర్ 6)న అరెస్ట్ చేసి కొత్తపేట న్యాయస్థానంలో హజరుపర్చగా  న్యాయస్థానం అతడికి 14రోజుల పాటు రిమాండ్ విధించడంతో ముద్దాయిని రాజమహేంద్రవరంలోని సెంట్రల్‌జైలుకు తరలించారు...

మరింత సమాచారం తెలుసుకోండి: