ఇటీవలి కాలంలో అంతర్జాతీయ భారత జట్టులో స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగాఎంతో మంది యువ క్రికెటర్లు సత్తా చాటుతున్నారు అన్న విషయం తెలిసిందే. కేవలం ఐపీఎల్ లో మాత్రమే కాదు ఇక వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటూ సెలెక్టర్లను ఆకర్షిస్తున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో అయితే ఎంతో మంది క్రికెటర్లు ఏకంగా యువ సూపర్ స్టార్ లుగా మారిపోతున్నారు. ఇంకా అంతే కాదు అరుదైన రికార్డును కూడానమోదు చేస్తూ ఉండటం గమనార్హం. ఇక ఇటీవలే దేశవాళీ క్రికెట్లో ఒక సంచలన రికార్డు నమోదు అయ్యింది.


 ఎంతో మంది సీనియర్ బౌలర్లకు సాధ్యంకాని ఫీట్ను ఒక యువ బౌలర్ సాధించి సరికొత్త రికార్డును సృష్టించాడు. సాధారణంగా టీ20 క్రికెట్ లో వికెట్లు తీయడం అన్నది సవాళ్లతో కూడుకున్న పని. ఎందుకంటే ఒకవైపు పరుగులకు కట్టడి చేస్తూనే మరోవైపు వికెట్ తీయాల్సి ఉంటుంది. అయితే ఇలా టీ20 క్రికెట్ ను వికెట్లు తీయడం గొప్ప అనుకుంటే విదర్భ ఆటగాడు దర్శన్ నల్కొండ మాత్రం ఒకే ఓవర్లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టి సరికొత్త రికార్డును సృష్టించాడు. టి 20 క్రికెట్ లో డబుల్ హాట్రిక్ చేసిన రెండవ ఇండియన్ ప్లేయర్ గా దర్శన్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు



 ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ  2021  జరుగుతుంది. ఇక ఈ ట్రోఫీ సెమీ ఫైనల్కు చేరుకుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఢిల్లీలోని ఫిరోజ్షా కోట్లా మైదానంలో కర్ణాటక- విదర్భ జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. అయితే మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక జట్టు భారీ స్కోరు దిశగా దూసుకుపోయింది. తొలి వికెట్ పడేసరికి 132 పరుగుల భాగస్వామ్యం లభించింది. అదే సమయంలో బంతితో సిద్ధం అయిన విదర్భ బౌలర్ దర్శన్ మ్యాజిక్ చేశాడు అని చెప్పాలి. తన ఆఖరి ఓవర్ వేయడానికి వచ్చిన దర్శన్ ఏకంగా తొలిబంతి డాట్ బాల్ వేసాడు. ఇక రెండో బంతి అనిరుద్ జోషి, మూడో బంతి శరత్ బీఆర్, నాలుగో బంతికి  సుజిత్ ఇక ఐదవ బంతికి అభినవ్ మనోహర్ ఇలా వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసుకున్నాడు. అయితే ఈ యువ ఆటగాడు ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: