
అయితే గత ఏడాది డిసెంబర్లో 2023 ఐపీఎల్ సీజన్ కు సంబంధించిన వేలం ప్రక్రియ ముగిసింది. ఈ క్రమంలోనే గత సీజన్లో ఇక జట్టులో ఉన్న ఆటగాళ్ళు ఇక ఈ సీజన్లో మరో జట్టుకు వెళ్లిపోయారు.. అంతేకాకుండా కొన్ని జట్లకు కెప్టెన్లు కూడా మారిపోయారు అని చెప్పాలి. దీంతో ఇక ఈసారి జట్టు ప్రదర్శన ఎలా ఉంటుంది అనేదానిపై ఒక అంచనాకు రాలేకపోతున్నారు క్రికెట్ నిపుణులు. ఈ క్రమంలోనే ఇక ఇటీవల బీసీసీఐ 2023 ఐపీఎల్ కు సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రకటించింది అని చెప్పాలి.
మార్చి 31వ తేదీ నుంచి కూడా ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది. ఎవరి ప్రదర్శన ఎలా ఉంటుంది అనేదానిపై ఇప్పటికే సోషల్ మీడియా వేదిక రివ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు ఎంతో మంది మాజీ ఆటగాళ్లు. కాగా బిసిసిఐ మాజీ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ సైతం ఇదే విషయంపై స్పందించాడు
భవిష్యత్తులో ఐపీఎల్ లో ఐదుగురు యువ ప్లేయర్లు పెద్ద ఆటగాళ్లుగా మారుతారు అంటూ అభిప్రాయపడ్డాడు సూర్య కుమార్ యాదవ్ ను స్పెషల్ కేటగరీ లోకి తీసుకోగా.. ఇక పృద్విషా, రిషబ్ పంత్, రుతురాజు గైక్వాడ్, ఉమ్రాన్ మాలిక్, శుభమన్ గిల్ పేర్లను సౌరబ్ గంగూలీ సూచించాడు. అయితే ప్రతి ఐపీఎల్ లో అద్భుతంగా ఆడే శ్రేయస్ అయ్యర్ ఇషాన్ కిషన్ పేర్లను పరిగణలోకి తీసుకోవడం మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది అని చెప్పాలి.