మాములుగా ఇంటిలో పండుగ రోజులలో ఆడవారిదే హవా మరియు హడావిడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దేవుడికి సంబంధించిన పనులు కావడం వల్ల ప్రతి ఒక్కటి వారి చేతుల మీదనే జరుగుతుంది. మరి పండుగ మాసంలో ఏ వారం ఏ పూజలు చేస్తారో చుడండి.  సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం, పౌర్ణమి, నాగుల చవితి చాలా విశిష్టతను కలిగినవి. సోమవారం శివుడి పూజకు, మంగళవారం వివాహమైన వనిత నోచుకునే మంగళవారం నోములు, శుక్రవారం ఏదో ఒక పూజ చేస్తూ ఉంటారు. శనివారం వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు. ప్రతిరోజూ ఇంట్లో అంతా పండుగ వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు నూతన వస్త్రాలు కాని, పట్టు వస్త్రాలు కాని ధరించి పూజలు చేసుకుంటారు.

ఈ కాలంలో ఆకు కూరలు పురుగు పట్టడం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోరు. ఆషాఢ మాసం నుంచి దేవీ పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ మాసంలో ఆచారాలు ఎక్కువగా ఉంటాయి....  నోములు, వ్రతాల పేరిట నియమ నిష్ఠలతో ఉంటారు. భారతీయ సంప్రదాయంలో ప్రతి నోముకు వ్రతానికి ప్రాధాన్యం అధికం. సోమవారాలు శివునికి ప్రాధాన్యం ఇస్తూ,  బ్రాహ్మణులను శివునిగా భావించి దానం ఇవ్వడం, మంగళ శుక్రవారాలు స్త్రీలను శక్తి స్వరూపంగా భావించి దానం ఇవ్వడం ఆచారం...స్త్రీలకు ఐదవతనం అవసరం కాబట్టి ఆ వస్తువులను మంగళ శుక్రవారాల్లో దానాలు ఇస్తారు.

సోమవారాలు  చంద్రునికి సంబంధించిన పాలు, బియ్యం, తెల్లని వస్త్రాలు దానం చేయడం వల్ల చిత్త చాంచల్యం నుంచి బయటపడగలుగుతారు. మంగళవార వ్రతాలు చేసుకునేవారు గురునికి సంబంధించిన వస్తువులు, శనగలు, పసుపురంగు వస్త్రాలు, పళ్ళు, స్వీట్స్‌ దానం చేయడం వల్ల సంతాన లోపాలు నివారించబడతాయి. గురుడు సంతానానికి కారకుడు కావున వివాహమైన స్త్రీలు మొదటి 5 సంవత్సరాలు మంగళగౌరి వ్రతాలు ఆచరిస్తారు. ఆరోజు శనగలు, పళ్ళు దానం చేయడం వల్ల సంతానసంబంధ దోషాలు నివారించి సకాలంలో సంతానం కలుగుతుంది. కాబట్టి ఆడవారు చేసే ప్రతి వ్రతం ఎంతో నియమ నిష్ఠలతో చేస్తే ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: