భారతీయ హిందూ సాంప్రదాయం ప్రకారం మహాలక్ష్మిదేవిని ఎంత గొప్పగా ఆరాధ్యదైవంగా పూజిస్తారో . ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే.. ఇంట్లో సుఖ సంపదలు పొందాలి అంటే ,పెద్ద ఎత్తున లక్ష్మీదేవికి పూజలు నిర్వహించాల్సిందే.. భక్తిశ్రద్ధలతో.. అమ్మవారి కటాక్షం కొరకు పూజలు చేస్తున్నారో  అలాంటి వారిపై అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు.. అమ్మవారికి మనం ఘనంగా భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం వలన మనం కోరుకున్న ఎటువంటి కోరికలు అయినా నెరవేరడంతో పాటు అష్టైశ్వర్యాలు కూడా మనకు సిద్ధిస్తాయి.. ఇలా కాసుల పంట కురిపించే మహాలక్ష్మీదేవి గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా చెబుతున్న విషయం తెలిసిందే..ఇకపోతే ఈ లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉందని , తన పేరు అలక్ష్మి అనే  విషయం బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు.. అయితే ఆ అలక్ష్మి ఎవరు.. ఆమె స్వభావం ఎటువంటిది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..పురాణాలు ప్రకారం చూస్తే.. అమృతం కోసం రాక్షసులు, దేవతలు కలిసి సాగరమధనం చేస్తున్న సమయంలో సముద్ర గర్భం నుంచి మహాలక్ష్మి దేవి పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే.. కానీ ఇదే సమయంలో సముద్రగర్భం నుంచి ముందుగా అలక్ష్మి ఉద్భవించింది.. అంటే లక్ష్మీదేవి కంటే ముందుగా అలక్ష్మి జన్మించింది.. కాబట్టి లక్ష్మీదేవి అక్క అలక్ష్మి అని సూచిస్తారు. లక్ష్మీదేవి జన్మించిన వెంటనే  విష్ణుమూర్తి ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తాడు.. కానీ ఆ సమయంలో లక్ష్మీదేవి తనను వివాహం చేసుకోవాలంటే ముందుగా తన అక్క అలక్ష్మికి వివాహం జరిపించాలని చెబుతుంది..అప్పటినుంచి మహావిష్ణువు అలక్ష్మి కి పెళ్లి సంబంధాలు చూస్తూనే ఉంటారు.. కానీ ఈమెను వివాహం చేసుకోవడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రారు.. అంటే లక్ష్మీదేవి ఎక్కడైతే కాలు పెడుతుందో అక్కడ సిరిసంపదలు కలుగుతాయి.. కానీ అలక్ష్మి కాలు పెట్టిన చోట పరమ దరిద్రం చుట్టుకుంటుంది..ఈ కారణం చేతనే ఆమెను వివాహం చేసుకోవడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రారు.. కానీ చివరకు సిరి సంపదలు మీద వ్యామోహం లేని ఒక ముని అలక్ష్మిని వివాహం చేసుకోవడానికి ముందుకు వస్తాడు. అలా వీరిద్దరి వివాహం జరిగిన తర్వాత విష్ణుమూర్తి , లక్ష్మీదేవిని పెళ్లి చేసుకుంటారు..

విష్ణుమూర్తి ,లక్ష్మీదేవి వివాహం చేసుకున్న వెంటనే సిరిసంపదలు వస్తాయి.. ఇక ముని ని వివాహం చేసుకున్న అలక్ష్మి , ఆ ముని తో కలిసి ఇంట్లోకి వెళ్లకుండా గుమ్మం దగ్గరే ఉంటుంది.. ఇక ఆ ముని ఇంట్లోకి రమ్మని పిలిస్తే ఇల్లు చాలా శుభ్రంగా ఉన్నచోట నేను ఉండను.. మురికిగా, అపరిశుభ్రంగా ఉన్న ఇంట్లోనే నేను ఉంటానని చెబుతుంది.. అందుకే మన ఇంట్లో శుభ్రంగా  ఉంటే అలక్ష్మీ అడుగుపెట్టదు. శుభ్రంగా  లేనిచోట అలక్ష్మీ మన ఇంట్లో అడుగుపెట్టి  దరిద్రానికి దారితీస్తుందని పండితులు చెబుతుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: