13 వ దక్షిణాసియా క్రీడల (సాగ్) ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లలో భారత్ మంగళవారం  జరిగిన అథ్లెటిక్స్ పోటీలో మొదటి రోజు మూడు స్వర్ణాలతో సహా 10 పతకాలు సాధించింది.  అర్చన సుసీంద్రన్ (మహిళల 100 మీ), ఎం. జష్నా (మహిళల హైజంప్), సర్వేష్ అనిల్ కుషారే (పురుషుల హైజంప్), అజయ్ కుమార్ సరోజ్ (పురుషుల 1500 మీ) ఒక్కొక్క  స్వర్ణం సాధించారు.

 

 

 

 అర్చన 11.80 సెకన్ల వేగంతో బంగారు పతాకాన్ని  సాధించింది,  వరుసగా రజతం, కాంస్య పతకాలు  శ్రీలంక తనుజీ అమాషా (11.82), లక్షిక సుగంద్ (11.84) లు సాధించారు. మహిళల హైజంప్‌లో, జష్నా స్వర్ణం కోసం 1.73 మీ., రుబినా యాదవ్ 1.69 మీటర్ల ప్రయత్నంతో కాంస్యం సాధించారు. పురుషుల హైజంప్ స్వర్ణం సాధించడానికి కుషారే 2.21 మీ.,  చేతన్ బాలసుబ్రమణ్య 2.16 మీటర్ల ప్రయత్నంతో రజతం సాధించాడు.

 

 

 

 

సరోజ్ 3.54.18 సమయంలో పురుషుల 1500 మీ. స్వర్ణం గెలుచుకోగా, అజీత్ కుమార్ 3.57.18 క్లాక్ చేసి రజతం సాధించాడు.   కాంస్య పతాకం  నేపాల్‌కు చెందిన టాంకా కార్కి (3.50.20 సె) కు వెళ్ళింది. అంతకుముందు, మహిళల 1,500 మీ. లో చందా (4.34.51) రజతం గెలుచుకోగా,  చిత్ర పాలకీజ్ (4.35.46) కాంస్యం సాధించింది . శ్రీలంక ఉడా కుబురళగే (4.34.34) స్వర్ణం సాధించింది .

 

 

 

 

మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో భారతీయ షూటర్లు అన్ని పతకాలను కైవసం చేసుకున్నారు, మెహులీ ఘోష్ ప్రపంచ రికార్డు కంటే మెరుగైన స్కోరుతో స్వర్ణం సాధించింది . మెహులి యొక్క ప్రయత్నం ప్రపంచ రికార్డుగా పరిగణించబడదు, ఎందుకంటే సాగ్ యొక్క ఫలితాలు రికార్డుల ప్రయోజనం కోసం  ఐ ఎస్ ఎస్  యఫ్  చేత గుర్తించబడవు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో భారత్  జట్టు కూడా స్వర్ణం సాధించింది.

 

 

 

సంబంధిత ఫైనల్స్‌లో నేపాల్, శ్రీలంకలను 3-0తో ఓడించి భారత పురుషుల మరియు మహిళల టేబుల్ టెన్నిస్ జట్లు బంగారు పతకాలు సాధించాయి. పురుషుల ఈవెంట్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్‌కు ఒక్కొక్క కాంస్య పతకం లభించింది. మహిళల్లో నేపాల్, మాల్దీవులకు ఒక్కొక్క కాంస్యం లభించింది.  భారతదేశం మంగళవారం పురుషుల మరియు మహిళల వాలీబాల్ టైటిళ్లను గెలుచుకుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: