లాక్టోజ్ సందర్భంగా ఎప్పుడు బిజీ బిజీగా ఉండే క్రికెట్ ఆటగాళ్లందరూ ప్రస్తుతం ఇంటికే పరిమితం కావడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెబుతూ తమ అభిమానులను అలరిస్తున్నారు క్రీడాకారులు. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఎబి డివిలియర్స్ ఇన్స్ స్టా  లైవ్ చాట్ లో పాల్గొని అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ వీరిద్దరిలో ఎవరు ఉత్తమం అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చాడు. 

 

 

 కోహ్లీకి నాకు సచిన్ టెండూల్కర్ రోల్ మోడల్ అని... ఆయన ఆట తీరు చూస్తే పెరిగే అంటూ తెలిపాడు. సచిన్ టెండూల్కర్ ఆటతీరు బాడీ టైమింగ్ ప్రస్తుతం ఏ  ఆటగాడికి సాధ్యం కాదు అంటూ తెలిపారు. ఎన్నో  అసాధ్యమైన రికార్డులు సచిన్ టెండూల్కర్ తన పేరిట లిఖించుకున్నాడు అంటూ తెలిపారు. అయితే తన దృష్టిలో ఫేవరెట్ ప్లేయర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంటూ చెప్పిన ఏబి  డివిలియర్స్... కానీ ఒక్క విషయంలో మాత్రం విరాట్ కోహ్లీ సచిన్ కంటే ముందు ఉంటాడు అంటూ చెప్పుకొచ్చాడు. 

 

 

 చేజింగ్ విషయంలో విరాట్ కోహ్లీ రికార్డులు ఎవరు అందుకోలేరు అంటూ తెలిపాడు. కొన్ని కొన్ని  సార్లు ఛేజింగ్  సమయంలో సచిన్ టెండూల్కర్ కూడా ఒత్తిడికి లోనై అవుట్ అయిన సందర్భాలు ఉన్నాయని... కానీ కోహ్లీకి ఛేజింగ్  అంటే ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పటివరకు విరాట్ కోహ్లీ చేసిన సెంచరీలు కూడా ఎక్కువగా ఛేజింగ్ లో ఉన్నప్పుడు చేసినవే అని తెలిపాడు. ఛేజింగ్ లో  విరాట్ కోహ్లీ ఎప్పుడు విజృంభిస్తూ  భారీ పరుగులు రాబడుతూ  ఉంటాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఆ  విషయంలో సచిన్ టెండూల్కర్ కంటే  విరాట్ కోహ్లీ ముందుంటాడు అంటూ తెలిపారు ఎబి డివిలియర్స్. ఇక అదే సమయంలో విరాట్ కోహ్లీ స్టీవ్  స్మిత్  లలో బెస్ట్ ప్లేయర్ ఎవరు అంటే ఇద్దరు బెస్ట్ ప్లేయర్స్  అని...  ఇద్దరి ఆట తీరు వేరు వేరుగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: