ఐపీఎల్లో రోజురోజుకీ సమీకరణాలు మారిపోతున్న విషయం తెలిసిందే. అంచనాలు లేని జట్లు అద్భుతంగా రాణిస్తూ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ సొంతం చేసుకుంటే ఎన్నో అంచనాల మధ్య  రంగంలోకి దిగిన దిగ్గజ జట్లు  సైతం విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించ లేక చివరికి పాయింట్ల పట్టికలో చివరన ఉంటున్న విషయం తెలిసిందే. దిగ్గజ ఆటగాళ్లు సైతం తమ  స్థాయి  ప్రదర్శన చేయకపోవడంతో ఆయా జట్లు  ఓటమి పాలు అవుతున్నాయి. ఈ క్రమంలోనే కోల్కతా నైట్రైడర్స్ జట్టు పడుతూ లేస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది.



 ఒక మ్యాచ్ లో  కోల్కతా నైట్రైడర్స్ జట్టు మళ్లీ ఫామ్ లోకి వచ్చి మంచి విజయాన్ని అందుకుంది అని అనుకునే లోపే ఆ తర్వాత పేలవ  ప్రదర్శనతో అభిమానులను నిరాశ పరుస్తూనే ఉంది. ఇలా ప్రతి మ్యాచ్లో కూడా అభిమానులందరినీ అయోమయంలో పడేస్తుంది కోల్కతా నైట్రైడర్స్ జట్టు. ఇక ఇలాంటి క్రమంలో ఇయాన్ మోర్గాన్ కు  కోల్కత్త జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి దినేష్ కార్తీక్ ను కెప్టెన్సీ బాధ్యతలనుంచి తొలగించాలని డిమాండ్ కూడా తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. దినేష్ కార్తీక్ సరైన ప్రదర్శన చేయకపోవడమే ఇందుకు కారణం.



 ఇలాంటి క్రమంలోనే అనూహ్య నిర్ణయం తీసుకున్న దినేష్ కార్తీక్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు కొత్త  కెప్టెన్గా ఇయాన్  మోర్గాన్ వచ్చాడు. ఇక దీనిపై స్పందించిన ఇయాన్ మోర్గాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్సీ మార్పుపై ముందుగానే తమ మధ్య చర్చ జరిగిందని... దినేష్ కార్తీక్ తన దగ్గరికి వచ్చి కెప్టెన్సీ నుంచి తప్పుకుటానని  కెప్టెన్సీ వల్ల బ్యాటింగ్ సరిగా చేయలేక పోతున్నాను అంటూ చెప్పాడు అన్న విషయాన్ని ఇయాన్ మోర్గాన్ తెలిపాడు. అలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఎంతో ధైర్యం కావాలి అంటూ ఇయాన్ మోర్గాన్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ipl