ఐపీఎల్ సీజన్ లో మునుపెన్నడూ లేని విధంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పేలవ ప్రదర్శన చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రతి సీజన్లో ఎన్నో అంచనాల మధ్య రంగంలోకి దిగి తప్పకుండా ప్లే ఆప్ కి అర్హత సాధిస్తూ ఉంటుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. కానీ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో మాత్రం టైటిల్ ఫేవరెట్ రంగంలోకి దిగినప్పటికీ అంచనాలను తారుమారు చేస్తూ పేలవ  ప్రదర్శనతో ఇప్పటికే ప్లేఆఫ్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పటికి కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఆటతీరు లో మాత్రం మార్పు రాలేదు. ప్రతి మ్యాచ్లో మరింత పేలవ ప్రదర్శన చేస్తుందే తప్ప తప్పులను గమనించి మరింత ప్రదర్శన మెరుగుపరచుకోవడానికి మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ ప్రయత్నించడం లేదు అన్నది అర్ధమవుతుంది.



 దీంతో అడుగడుగునా చెన్నై సూపర్ కింగ్స్ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. నిన్న ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసి పూర్తిగా తేలిపోయిన విషయం తెలిసిందే. 9 వికెట్ల నష్టానికి 115పరుగులు మాత్రమే చేసి మరోసారి విమర్శల పాలైంది. అనంతరం ఛేదనకు  కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టు కేవలం 12.2 ఓవర్ల వ్యవధిలోనే లక్ష్యాన్ని ఛేదించి పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే తుది జట్టు ఎంపిక నుంచి బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు వరకు చెన్నై జట్టు లో అన్ని తప్పిదాలే ఉన్నాయని మాజీలు  ఇప్పటికే విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.



 యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి ఉంటే చెన్నై జట్టు ప్రదర్శన వేరే లాగా ఉండేది అని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఋతురాగ్,  జగదీష్ స్థానంలో మురళీ విజయ్  ని ఆడించి ఉంటే బాగుండేది అన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక రెండవ స్థానంలో వచ్చిన రాయుడును  బూమ్రా బోల్తా కొట్టించి వికెట్ చేశాడు. ఇక అప్పుడైనా ధోని రంగంలోకి దిగి  బాగుండేది. సామ్ కరణ్ ను  బ్యాటింగ్ పంపి ఉన్న చెన్నై కోలుకునే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ధోనీ క్రీజులోకి వచ్చి  ఎక్కువగా బౌండరీలు కొట్టడానికి ప్రయత్నించకుండా స్ట్రైక్ రొటేట్ చేయడానికి ప్రయత్నించి ఉంటే బాగుండేదని అటు కామెంటేటర్ కూడా అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: